Ram Gopal Varma: ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి…కానీ వర్మ రాకతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త వైభవం వచ్చింది. ప్రతి సినిమాలో ఒక ఇంటెన్స్ డ్రామా ను క్రియేట్ చేసి ప్రేక్షకులందరిని మెప్పించిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఆయన వాడిన డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం మెప్పించిన దర్శకుడు… ఇక అలాంటి రాంగోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏమాత్రం తన సత్తా చాటుకోలేకపోతున్నాడు. ఇక వర్మ ‘రక్త చరిత్ర’ సినిమా కోసం కొంతమందిని కలిసి వాళ్ల దగ్గర నుంచి ఆ స్టోరీ కి సంబంధించిన ఇన్పుట్స్ ను తీసుకునే ప్రయత్నం చేశాడు.
ఇక అందులో భాగంగానే వర్మ ఒక రోజు ఒక ఫ్యాక్షనిస్ట్ ను కలిసినప్పుడు ఆ వ్యక్తి రక్తచరిత్ర కథకి సంబంధించిన విషయంలో చాలా వరకు హెల్ప్ చేశారట. ఇక అనుకోకుండా మరొక రోజు అతనే స్వయంగా ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలని ఉంది అన్నయ్య అని వర్మ ను అడిగారట. దాంతో వర్మ సైతం రమ్మని తనను కలిశాడు.
ఇక ఆ ఫ్యాక్షనిస్టు వచ్చి కలిసి పాలనా హీరో మీకు చాలా మంచి ఫ్రెండా అన్న అని అడిగాడట. దాంతో వర్మ ఫ్రెండ్ కాదు కానీ పరిచయం ఉందంతే అని చెప్పారట. ఇదంతా ఎందుకు అడుగుతున్నావ్ అని వర్మ అతన్ని అడగగా ఆ ఫ్యాక్షనిస్టు నేను ఆ హీరోను చంపాలనుకుంటున్న, ఆయన్ని చంపితే మీరేమైన ఫీల్ అవుతారా అని అన్నాడట. దాంతో వర్మ ఒక్కసారిగా షాక్ అయిపోయారంటా…
నిజానికి ఫ్యాక్షనిస్టు లతో ఫ్రెండ్షిప్ అనేది లోడ్ చేసిన గన్ను లాంటిది. దానివల్ల మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అంటూ వర్మ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఫ్యాక్షనిస్ట్ ఎవర్ని చంపాలి అనుకున్నాడనే విషయాన్ని మాత్రం వర్మ బయట పెట్టలేదు. ఇక ఆ ఫ్యాక్షనిస్టు ఎవరో కూడా తను చెప్పలేదు. మొత్తానికైతే వర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…








