Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Capital: అమరావతి కోసం సంకల్పం.. అడుగడుగునా ఆటంకం!

Amaravati Capital: అమరావతి కోసం సంకల్పం.. అడుగడుగునా ఆటంకం!

Amaravati Capital: తెలంగాణ ఉద్యమం ప్రాంతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఆ సమయంలో పార్టీల, వర్గాల ఒక లక్ష్యం కోసం కట్టుబడ్డారు. ఆ యుద్ధ భావననతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. ఆంధ్రాప్రాంత ప్రజలు వ్యతిరేకించినా.. తెలంగాణ మొత్తం ఏకమైంది. లక్ష్యం చేరుకుంది. అలాంటి ఐక్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో కనిపించడం లేదు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా రాజధాని లేని రాష్ట్రంగానే మిగలిపోయింది. సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి కోసం సంకల్పం తీసుకున్నారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రాజధాని నిర్మాణ పనలూ వేగంగా జరుగుతున్నాయి. అయితే ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన జగన్‌మోహన్‌రెడ్డి అమరావతిని వ్యతిరేకించడంతో రాజధానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. రాజకీయ వాతావరణం, వ్యక్తిగత వ్యూహాలు, అధిష్టాన ఉద్దేశాల కారణంగా సమస్య మరింత క్లిష్టంగా మారింది.

అమరావతి ఒక బ్రాండ్‌..
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి ఒక బ్రాండ్‌ తీసుకురావడానికి సీఎం చంద్రబాబునాయుడు అహర్షిలు కష్టపడుతున్నారు. అమరావతి పరపతి మాత్రమే కాదు, హక్కు కూడా. పార్లమెంట్‌ ద్వారా అమరావతిని రాష్ట్ర రాజధానిగా ధ్రువీకరించి తీర్మానం ఉన్నప్పటికీ, అమరావతి ప్రాధాన్యతను అభివృద్ధి, ఆర్ధిక పునర్రూపకల్పన, రైతు సంకల్పంతో కూడిన సామాజిక ఒప్పందంగా చూడాలి. ఎన్నో వేల ఎకరాలు దిగుబడిలేని భూములను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి తమ భవిష్యత్‌కు బాటలు వేసుకున్నారు. ప్రాజెక్టులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల రూపొందింపు ఈ పట్టదారుల ఆశలపై ఆధారపడి ఉన్నాయి.

వ్యతిరేక రాజకీయం..
అయితే రాజకీయంగా పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రపతి స్థాయిలో అమరావతి నిర్ణయాన్ని సైతం మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజధాని నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారు. భవిష్యత్‌లో ‘మావిగన్‌‘ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇలాంటి రాజకీయ వ్యతిరేకతలు అమరావతికి ఆటంకంగా మారుతున్నాయి.

న్యాయ,పారిపాలనా సవాళ్లు
పార్లమెంటు ఆమోదం ఉన్నా, రాష్ట్ర స్థాయిలో అమలుకు అనేక సాంకేతిక, న్యాయపరమైన అంశాలు ఉన్నాయి. భూమి బదిలీలు, ప్రాజెక్ట్‌ ఫండింగ్, స్థానిక సంస్థల మంజూరు, వ్యవసాయ పరిష్కారాల అమలు వంటి పనులు అంతులేని కార్యయజ్ఞాలుగా మారతాయి. పెట్టుబడుల ప్రవాహం, మౌలిక వసతుల బహిర్గతత, ప్రభుత్వ లాజిస్టిక్స్‌ అన్ని సమన్వయం కావాలి. ఇదే సమయంలో రాజకీయ ఆందోళనలు, సహకారంతో కూడని పరిస్థితులు ఈ పనులను ఆలస్యం చేస్తాయి.

సామాజిక, ఆర్థిక పరిణామాలు..
అమరావతి నిర్మాణం వలన ఏర్పడే ప్రత్యక్ష ప్రయోజనాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. స్థానిక ఉపాధి అవకాశాలు, దారిద్య్ర తగ్గింపు, నగరీకరణ ద్వారా సేవల అందుబాటు. అయితే ఈ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆలస్యాలు, వివాదాలు ఎక్కవితే రైతుల ఆర్థిక భరోసా విచ్ఛిన్నం అవుతుందని భయంకరం. ప్రత్యేకంగా భూములను ఇచ్చిన రైతులు వారి జీవనాధారం మెరుగుపడుతుంది. రైతుల హక్కులు, పునరావాసం, పరిహారం, భవిష్య రక్షణ వంటి అంశాలు చట్టపరంగా భరోసా ఇవ్వాలి.

అమరావతి నిర్మాణం ప్రజల ఆశలు, ఆశయాలతో కూడిన సంకల్పం. రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని సంక్షిష్టం చేయడం బాధాకరం. రాజధాని ఇబ్బందులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ రాష్ట్రాన్ని ఇంకా ఎంతకాలం రాజధాని లేకుండా చేస్తారు. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి. రాజధాని కోసం అందరూ ఏకం కావాలి. తెలంగాణ తరహాల్లో ఐక్యంగా ముందుకు సాగాలి. అమరావతి నిలబడాలంటే నాయకత్వం పారదర్శకంగా, నిబద్ధతతో, ప్రజా ఆశల ప్రకారం ఆచరణలో కనిపించాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular