Homeఆంధ్రప్రదేశ్‌Donald Trump: ట్రంప్‌ను లేపేసేందుకు ఇరాన్‌ స్కెచ్‌.. గుట్టు రట్టు చేసిన ఇజ్రాయెల్‌!

Donald Trump: ట్రంప్‌ను లేపేసేందుకు ఇరాన్‌ స్కెచ్‌.. గుట్టు రట్టు చేసిన ఇజ్రాయెల్‌!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను లేపేసేందుకు ఇరాన్‌ మళ్లీ స్కెచ్‌ వేసింది. ఇరాన్‌–అమెరికా యుద్ధ సమయంలోనే ఇరాన్‌ రెవల్యూషరనీ గార్డ్స్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీ) ట్రంప్‌ హత్యకు కుట్ర చేసింది. కానీ సక్సెస్‌ కాలేదు. తాజాగా ఇజ్రాయెల్‌ అమెరికాకు ఇచ్చిన ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో మరోసారి ఇరాన్‌ కుట్రను బయటపెట్టింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎస్‌ బయటపెట్టింది. అదే సమయంలో వైట్‌ హౌస్‌ కొన్ని అధికారులు ఆ ఇన్ఫోను అమెరికాను ఇరాన్‌పై చర్యలకు ప్రేరేపించడానికి ఉపయోగించబడిందని అనుమానిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ […]

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను లేపేసేందుకు ఇరాన్‌ మళ్లీ స్కెచ్‌ వేసింది. ఇరాన్‌–అమెరికా యుద్ధ సమయంలోనే ఇరాన్‌ రెవల్యూషరనీ గార్డ్స్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీ) ట్రంప్‌ హత్యకు కుట్ర చేసింది. కానీ సక్సెస్‌ కాలేదు. తాజాగా ఇజ్రాయెల్‌ అమెరికాకు ఇచ్చిన ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో మరోసారి ఇరాన్‌ కుట్రను బయటపెట్టింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎస్‌ బయటపెట్టింది. అదే సమయంలో వైట్‌ హౌస్‌ కొన్ని అధికారులు ఆ ఇన్ఫోను అమెరికాను ఇరాన్‌పై చర్యలకు ప్రేరేపించడానికి ఉపయోగించబడిందని అనుమానిస్తున్నారు.

ఇంటెలిజెన్స్‌ నివేదిక బదిలీ..
అమెరికా–ఇజ్రాయెల్‌ మిత్రదేశాలు. వీటి మధ్య ఇంటెలిజెన్స్‌ షేరింగ్‌ సహజ ప్రక్రియ. ఇందులో భాగంగా నెలనెలా తమ నివేదికలను పరస్పరం మార్చుకుంటాయి. తాజాగా ఇజ్రాయెల్‌ అమెరికాకు జూన్‌కు సంబంధించిన నివేదిక అందించింది. అందులో ఇరాన్‌ చేసిన కుట్రను బయటపెట్టింది. ఇప్పటికే హర్మూజ్‌ విషయంలో ఇరాన్‌–అమెరికా మధ్య మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌ హర్మూజ్‌ను తమ అధీనంలో ఉంచుకుని ఓడల నుంచి ట్యాక్స్‌ వసూలు చేయాలని చూస్తోంది. దీనిని అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్‌ నివేదిక ఇప్పుడు ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది.

ఇజ్రాయెల్‌ నివేదికపై అనుమానాలు?
ఇజ్రాయెల్‌ ఇచ్చిన నివేదిక సరైనదేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత నెలలో ఇరాన్‌–అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ సమయంలో ఇజ్రాయెల్‌ను సంప్రదించలేదు. దీంతో శాంతి ఒప్పందం తర్వాత కూడా ఇరాన్‌ ప్రాక్సీ అయిన లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. దీంతో ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అమెరికా కూడా ఇజ్రాయెల్‌ తీరును తప్పు పట్టింది. అమెరికా–ఇరాన్‌ శాంతి ఒప్పందం ఇజ్రాయెల్‌కు నచ్చలేదు. అందకు తాజాగా అమెరికాను రెచ్చగొట్టేందుకు తాజాగా ఇంటెలిజన్స్‌ నివేదికలో ట్రంప్‌ హత్య సమాచారం కూడా కావాలనే ఇచ్చినట్లు తెలుస్తోంది.

అమెరికా ఏం చేస్తుంది?
ఇజ్రాయెల్‌ నివేదికపై అమెరికా ఇంకా స్పందించలేదు. ఇప్పటికే అమెరికా–ఇరాన్‌ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ నివేదికను అమెరికా పరిగణనలోకి తీసుకుంటే మళ్లీ పరస్పర దాడులు ఖాయం. అదే జరిగితే మళ్లీ హర్మూజ్‌ను ఇరాన్‌ మూసివేసే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తప్పదు.

ఇప్పుడిప్పుడే మెరుగు పడుతున్న పరిస్థితులు…
మూడు నెలల పాటు సాగిన అమెరికా–ఇరాన్‌ వార్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అనేక దేశాల్లో చమురు ధరలు పెరిగాయి. భారత్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకపై తీవ్ర ప్రభావం పడింది. చమురు ధరలు భారీగా పెరిగాయి. శాంతి ఒప్పందం తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ రిపోర్టు ఇప్పుడు ప్రపంచ దేశాలను మళ్లీ టెన్షన్‌ పెడుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper