TDP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా సభలో మంచి చర్చ జరుగుతోంది. మరో రెండు రోజులు సమావేశాలు కొనసాగులు ఉన్నాయి. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. నిన్న శాసనమండలి వాయిదా వేయడం కు టిడిపి ఎమ్మెల్సీలు లాబీల్లో మంత్రులతో కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. మంత్రులు నారా లోకేష్,పయ్యావుల కేశవ్,వంగలపూడి అనిత, సవిత, ఫరూక్, గుమ్మిడి సంధ్యారాణి ఉండగా.. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీద రవిచంద్ర, రామ్ గోపాల్ రెడ్డి, శ్రీకాంత్, పంచుమర్తి అనురాధ, కావలి గ్రీష్మ ఉన్నారు. వారి మధ్య వయసు పై ఆసక్తికర చర్చ నడిచింది.
* సరదా చర్చ..
మంత్రి నారా లోకేష్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తావన తీసుకొచ్చారు. బుచ్చయ్య తాత ఇంకా రంగుల షర్టులతో మెరిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను. యూత్ ను అంటున్నారని మంత్రి లోకేష్ చమత్కరించారు. 85 ఏళ్లు దాటిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారని.. రోజు స్విమ్మింగ్, వ్యాయామం చేస్తున్నారంటూ అక్కడ ఉన్నవారు ప్రస్తావించారు. అయితే వారిద్దరి కంటే తాను చిన్నవాడిని అని మంత్రి ఫరూక్ వ్యాఖ్యానించారు. తాను సీఎం చంద్రబాబు కంటే 20 రోజులు చిన్నవాడిని చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.
* సీనియర్లు చాలామంది..
ప్రస్తుతం శాసనసభలో 70 సంవత్సరాలు దాటిన వారిలో సీఎం చంద్రబాబు, వరదరాజులు రెడ్డి అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఫరూక్, కళా వెంకట్రావు వంటి నేతలు ఉన్నారు. 60 నుంచి 70 సంవత్సరాల మధ్యలో దాదాపు ఓ 20 నుంచి 30 మంది వరకు ఎమ్మెల్యేలు ఉంటారు. అయితే ఈసారి కూటమి తరుపున బరిలో నిలిచింది యువత ఎక్కువ. నడివయస్కులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం క్యాబినెట్లో పదిమంది వరకు కొత్త వారే. తొలిసారి ఎన్నికైన వారే. కానీ వచ్చే ఎన్నికల్లో 70 సంవత్సరాలు దాటిన వారిలో ఒక్క చంద్రబాబు తప్ప మిగతావారు పోటీ చేసే అవకాశం చాలా తక్కువ. చూడాలి మరి ఏం జరుగుతుందో..