Homeబిజినెస్Why Employees Resign :ఒక సంస్థలో ఉద్యోగి ఎందుకు రాజీనామా చేస్తాడు?

Why Employees Resign :ఒక సంస్థలో ఉద్యోగి ఎందుకు రాజీనామా చేస్తాడు?

Why Employees Resign : ఒక కంపెనీకి ఉద్యోగి పిల్లర్ లాంటివాడు. అతడు కేవలం తన విధులను నిర్వహించడం మాత్రమే కాకుండా బాధ్యతగా ఉంటాడు. కొత్త విషయాలు నేర్చుకోవడం.. తనకు ఉన్న నైపుణ్యాన్ని కంపెనీ కోసం ప్రదర్శించడం.. కొత్త లక్షాలను ఏర్పాటు చేసుకొని వాటిని అధిగమించడం వంటివి చేస్తాడు. ఈ క్రమంలో అతనితోపాటు కంపెనీ కూడా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో రాజీనామా చేసే ఉద్యోగుల్లో ఎక్కువగా బెస్ట్ ఎంప్లాయిస్ మాత్రమే ఉంటారు. […]

Why Employees Resign : ఒక కంపెనీకి ఉద్యోగి పిల్లర్ లాంటివాడు. అతడు కేవలం తన విధులను నిర్వహించడం మాత్రమే కాకుండా బాధ్యతగా ఉంటాడు. కొత్త విషయాలు నేర్చుకోవడం.. తనకు ఉన్న నైపుణ్యాన్ని కంపెనీ కోసం ప్రదర్శించడం.. కొత్త లక్షాలను ఏర్పాటు చేసుకొని వాటిని అధిగమించడం వంటివి చేస్తాడు. ఈ క్రమంలో అతనితోపాటు కంపెనీ కూడా అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో రాజీనామా చేసే ఉద్యోగుల్లో ఎక్కువగా బెస్ట్ ఎంప్లాయిస్ మాత్రమే ఉంటారు. అసలు వీళ్ళు రాజీనామా చేయడానికి కారణం ఏంటి? వీళ్లు పనిమంతులూ కాదా? మరి ఏ విషయంలో ఆందోళన చెందుతారు?

ఒక ఉద్యోగి తన విధులను సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తాడు. అయితే సంస్థలో లేదా కార్యాలయాల్లో కొందరు తమకంటే ఎక్కువగా గుర్తింపును పొందితే ఓర్వ లేకుండా ఉంటారు. దీంతో పక్కన ఉన్నవారే అతని గురించి చెడుగా చెప్పడంతో పాటు.. వీరి టీం లీడర్ కూడా ఒక్కోసారి తన మాట వినడు అని నిర్ణయించుకున్న తర్వాత.. ఆ ఉద్యోగిపై పదేపదే అసంతృప్తి చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో ఆ ఉద్యోగి కూడా తన కృషికి గుర్తింపు రాకపోవడంతో మొదట్లోనే అసంతృప్తిగా ఉంటాడు. అయితే ఈ సమయంలో రాజీనామా చేయడు.

ఒక సంస్థలో చేరిన ఏ ఉద్యోగి అయినా గ్రోత్ ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే బెటర్ రావాలని అనుకుంటారు. ఇందుకోసం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. కానీ కానీ ఎంత చేసినా కూడా గ్రోత్ లేకపోతే ఆ కంపెనీని వదిలిపెట్టి అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగడానికి మరో కంపెనీకి మారేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతను రాజీనామా చేయాల్సి వస్తుంది..

ఎవరైనా డబ్బుల కోసమే పని చేస్తారు. అయితే తమ కష్టానికి గుర్తింపుగా డబ్బులు వస్తేనే ఆ సంస్థలో ఉంటారు. కానీ కొన్ని సంస్థల్లో ఎక్కువ పని ఉంటూ తక్కువ జీతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో తనకు జీతం విషయంలో సరైన న్యాయం జరగకపోతే వేరే కంపెనీకి మారాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగికి జీతంతో పాటు బోనస్ మాంటివి లేకపోతే కూడా వేరే కంపెనీ వైపు చూస్తుంటారు..

ఒక సంస్థలో ఉద్యోగి ఎంత ముఖ్యమో టీం లీడర్ లేదా మేనేజర్ కూడా అంతే ముఖ్యం. అతని ప్రవర్తనతో ఉద్యోగుల పనితీరు ఉంటుంది. అతని ప్రవర్తన నచ్చకపోతే ఉద్యోగులు అసంతృప్తిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వారు కొన్ని తప్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది. అయితే ఉద్యోగులపై మేనేజర్ తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తే వారు రాజీనామా చేసే అవకాశాలు ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper