Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు సామ్రాజ్యవాద కాంక్షతో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్దం మొదలు పెట్టాడు. ఇజ్రాయెల్‌ను కలుపుకుని భీకర దాడులు చేశాడు. యుద్ధం మొదలైన రెండు రోజులకే ఇరాన్ చీఫ్ అయతుల్లా ఖమేనీతోపాటు టాప్ లీడర్లు, కీలక అధికారులు దాడుల్లో హతమయ్యారు. దీంతో ఇరాన్ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ ఐఆర్‌జీసీ, ఇరాన్ ప్రాక్సీ గ్రూపుల సహకారంతో అమెరికా మిత్రదేశాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. దీంతో గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడులతో వణికిపోయాయి. మరోవైపు హర్మూజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంఖోభం ఏర్పడింది. ఈ తరుణంలో ట్రంప్ ప్లాన్ తలకిందులైంది. దీంతో శాంతి చర్చలు అంటూ కొత్తరాగం అంందుకున్నాడు. మూడు నెలల తాత్కాలికి యుద్ధ విరామం తర్వాత స్విట్జర్‌లాండ్‌లో శాంతి ఒప్పందం కుదిరింది. కానీ తర్వాత ఆ డీల్‌ను కూడా అమెరికా ఉల్లంఘించింది. ఇరాన్ కూడా ప్రతిదాడులు మొదలు పెట్టింది. ఇప్పుడు ఇరాన్ అణు పరీక్షలు ఆపాలన్న కండీషన్ లేకుండానే మళ్లీ శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
క్షిణిస్తున్న అమెరికా ఆయుధ నిల్వలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన ప్రస్తుతం అనేక సవాళ్ల మధ్య నలుగుతోంది. ఆయుధ నిల్వలు క్షీణిస్తున్నాయి, మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్నాయి, అదే సమయంలో ఇరాన్‌తో చర్చలు ఫలితం ఇవ్వకుండా సాగుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సుదీర్ఘ సంఘర్షణ లాభాల కంటే నష్టాలనే ఎక్కువగా తెచ్చిపెడుతుండటంతో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీని ఫలితంగా యుద్ధం నుంచి నిష్క్రమించే మార్గాలను అన్వేషణ మొదలు పెట్టారు.
అణు ఒప్పందాన్ని పక్కన పెట్టి..
మొదటి నుంచి పట్టుబట్టిన అణు ఒప్పందాన్ని కూడా వదులుకోవడానికి ట్రంప్ సిద్ధమైనట్లు అమెరికా మీడియా విశ్వసనీయ వర్గాల ఆధారంగా తెలిసింది. అణు అంశాలు లేకుండానే టెహ్రాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఎలాంటి షరతులు లేకుండా పూర్తిగా తెరిస్తే అప్పుడు ఒప్పందానికి అంగీకరిస్తానని తన సన్నిహితులకు ప్రైవేటుగా చెప్పినట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని అంతం చేసేందుకు అణు డీల్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవలి శాంతి చర్చలు విఫలం..
ఇటీవల జరిగిన శాంతి చర్చలు మాత్రం విఫలమయ్యాయి. టెహ్రాన్ వైపు నుంచి సంఘర్షణను ఎంతకాలమైనా కొనసాగించే సంకేతాలు వెలువడుతున్నాయి. హర్మూజ్‌ను తెరిచే విషయంలో ఇరాన్ తన షరతులు స్పష్టంగా ఉంచింది. అమెరికా ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, ప్రాంతం నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలగాలని డిమాండ్ చేస్తోంది. యుద్ధం శాశ్వతంగా ముగిసే వరకు జలసంధిని తెరవబోమని కఠినంగా ప్రకటించింది. ఇవి చర్చలకు పెద్ద అడ్డంకులుగా మారాయి.
మధ్యంతర ఎన్నికల ఒత్తిడి..
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. హర్మూజ్ ద్వారా నౌకా రవాణాకు అంతరాయం కొనసాగడంతో చమురు ధరలు తగ్గడం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే బహిరంగ ప్రకటనల్లో మాత్రం భిన్న స్వరం వినిపిస్తోంది. ఇటీవల ఒక మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌తో చర్చల విషయంలో తొందర లేదని, అమెరికా ప్రశాంతంగా ఉందని, టెహ్రాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉండి నగదు కొరత ఉందని అన్నారు.
ఇరాన్ కఠిన హెచ్చరిక..
అదే సమయంలో ఇరాన్ అమెరికాపై మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా సిబ్బంది తమ భూభాగంలో ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బ్రిగేడియర్ జనరల్ అలీ జహన్‌షాహీ స్పష్టం చేశారు. ప్రత్యర్థి చర్యలకు దఢంగా సమాధానం ఇస్తామని ఆయన అన్నారు.
దేశీయ రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక ప్రభావాలు, సైనిక నష్టాలు కలిసి ట్రంప్ ప్రభుత్వాన్ని ఇరాన్‌తో సమాధానం కనుగొనే దిశగా నెట్టుతున్నాయి. అయితే రెండు వైపులా ఉన్న కఠిన వైఖరులు ఇంకా పరిష్కారానికి దూరంగా ఉంచుతున్నాయి.