Homeఎంటర్టైన్మెంట్Richest Directors: తెలుగులో టాప్ 3 రిచెస్ట్ డైరెక్టర్స్ వీళ్లే... వాళ్ళ ఆస్తుల విలువ ఎంతంటే...

Richest Directors: తెలుగులో టాప్ 3 రిచెస్ట్ డైరెక్టర్స్ వీళ్లే… వాళ్ళ ఆస్తుల విలువ ఎంతంటే…

Richest Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళు హీరోలుగా రాణిస్తూనే బిజినెస్ లను కూడా చాలా హై రేంజ్ లో చేస్తూ మొత్తానికైతే భారీగా డబ్బులను ఆర్జీస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు దర్శకులకు కూడా చాలా మంచి క్రేజ్ పెరిగింది. ఒక హీరోకి భారీ సక్సెస్ ని కట్టబెట్టడంలో దర్శకుడు కీలకపాత్ర వహిస్తున్నాడు. ఆయన […]

Richest Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళు హీరోలుగా రాణిస్తూనే బిజినెస్ లను కూడా చాలా హై రేంజ్ లో చేస్తూ మొత్తానికైతే భారీగా డబ్బులను ఆర్జీస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు దర్శకులకు కూడా చాలా మంచి క్రేజ్ పెరిగింది. ఒక హీరోకి భారీ సక్సెస్ ని కట్టబెట్టడంలో దర్శకుడు కీలకపాత్ర వహిస్తున్నాడు. ఆయన వల్లే సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయనేది వాస్తవం… ఇలాంటి క్రమంలోనే మన దర్శకులు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అలాగే వాళ్లు కూడా హీరోల మాదిరిగానే కొన్ని బిజినెస్ లను స్టార్ట్ చేసి దాని ద్వారా కొన్ని లాభాలను గడిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వాళ్లలో రిచెస్ట్ డైరెక్టర్ ఎవరనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజమౌళి నెంబర్ వన్ రిచెస్ట్ డైరెక్టర్ గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక్క సినిమాకి దాదాపు 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఆ అమౌంట్ నుంచి చాలా వరకు బిజినెస్ లను కూడా స్టార్ట్ చేశారట. ఆ బిజినెస్ లను తన కొడుకు అయిన కార్తికేయ చూసుకుంటున్నాడు. దాని ద్వారా కూడా భారీగానే లాభాన్ని అర్జీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా వాళ్ళు ఏ వర్క్ చేసినా కూడా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయి చేస్తుంటారు. కాబట్టి వాళ్లకు భారీ లాభాలు వస్తాయి. ప్రస్తుతం రాజమౌళి కి 1000 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట.

ఇక అతని తర్వాత ప్లేస్ లో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సుకుమార్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే సుకుమార్ రైటింగ్స్ పేరుతో కూడా ఆయన చాలా వరకు కథలను, స్క్రీన్ ప్లే ని, డైలాగ్స్ ని అందిస్తూ దాంట్లో కూడా లాభాలను గడిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఆయన ఒక సినిమాకి 100 కోట్ల వరకు పారితోషికాన్ని తీసుకున్నాడు. అలాగే తన భార్య కూడా కొన్ని బిజినెస్ లను చేస్తుంది. తన రైటింగ్స్ ద్వారా సైడ్ ఇన్కమ్ గా మరికొంత మనీ ని సైతం ఎర్న్ చేస్తుండడంతో అతను సైతం రిచెస్ట్ డైరెక్టర్లలో నెంబర్ 2 పొజిషన్ ని దక్కించుకోవడం విశేషం…ప్రస్తుతం ఆయనకి 800 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయనే టాకైతే ఉంది…

ఇక వీళ్లిద్దరి తర్వాత మూడోవ పొజిషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు. ఆయన ఒక సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను. ఛార్జ్ చేయడమే కాకుండా ఇంతకుముందు రైటర్ గా కూడా బాగానే సంపాదించాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాని తను ముందుగా చూసి దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేస్తుంటాడు. కాబట్టి అతను దాని ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు.

ఇక తన భార్య అయిన సాయి సౌజన్య సైతం సితార బ్యానర్ లో అఫీషియల్ గా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగుతుండటం వల్ల కూడా అతనికి భారీ మొత్తంలోనే డబ్బులు వస్తున్నాయని తెలుస్తుంది.ప్రస్తుతం ఆయనకి 700 కోట్ల వరకు ఆస్తులు ఉంటాయట.

ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. కాబట్టి ఇప్పుడు వెంకటేష్ తో చేస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మరోసారి ప్రేక్షకులు అలరించాలని చూస్తున్నాడు…ఆ తర్వాత ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టును చేయబోతుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper