Homeఅంతర్జాతీయంDonald Trump : అమెరికన్ డాలర్ పై ట్రంప్.. పీక్స్ కు వెళ్లిన పబ్లిసిటీ...

Donald Trump : అమెరికన్ డాలర్ పై ట్రంప్.. పీక్స్ కు వెళ్లిన పబ్లిసిటీ పిచ్చి..

Donald Trump : ఈ ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రచారాన్ని కోరుకుంటారు. కాకపోతే ఆ ప్రచారం జనాలు ఆమోదించే స్థాయిలో ఉండాలి. అది మరింత పెరిగిపోతే జనాలు ఆ రాజకీయ నాయకులను ట్రోల్ చేస్తూ ఉంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతున్నారు. వాస్తవానికి ట్రంప్ ట్రోల్ అవడం ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ.. ఈసారి ఆయన గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం […]

Donald Trump : ఈ ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రచారాన్ని కోరుకుంటారు. కాకపోతే ఆ ప్రచారం జనాలు ఆమోదించే స్థాయిలో ఉండాలి. అది మరింత పెరిగిపోతే జనాలు ఆ రాజకీయ నాయకులను ట్రోల్ చేస్తూ ఉంటారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతున్నారు. వాస్తవానికి ట్రంప్ ట్రోల్ అవడం ఇదే తొలిసారి కాకపోయినప్పటికీ.. ఈసారి ఆయన గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం.

అమెరికాలో అక్కడి నాణేలు ముద్రించే టంక శాల 250 వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖం కల్పించే విధంగా ఒక డాలర్ కాయిన్ విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్టు యూఎస్ మింట్ కాంపౌండ్ ప్రకటించింది. కాయిన్ మీద ఒకవైపు ట్రంప్ ముక్క చిత్రం.. లిబర్టీ.. 1776 అని ప్రింట్ చేశారు. ఇంకొక వైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల అధికారికముద్రం ఉండే విధంగా చిత్రం రూపొందించారు. దీనికి అమెరికా కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ తన ఆమోదాన్ని తెలిపింది.

ఈ నాణేల తయారీకి సంబంధించి కమిషన్ సభ్యులను ట్రంప్ స్వయంగా నియమించడం విశేషం. అయితే తన ముఖచిత్రాన్ని నాణెం మీద ముద్రించాలి అనే కోరిక రావడం చాలా అసాధారణమైనదని.. ట్రంప్ ఆ మధ్య వ్యాఖ్యానించడం విశేషం. అమెరికన్ చట్టాల ప్రకారం అధ్యక్షుడు జీవించి ఉండగానే అమెరికన్ కరెన్సీ మీద ముద్రించడం నిషేధం. కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో స్పెషల్ కాయిన్స్ ముద్రించడానికి.. ఆదేశాలు జారీ చేయడానికి అక్కడి ట్రెజరీ సెక్రటరీకి అధికారం ఉంటుంది. 20 కాయిన్స్ ఉన్న ఒక రోల్ ధర 61 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. అలాగే 100 కాయిన్స్ ఉన్న ఒక బ్యాగ్ ధర 154.50 డాలర్లుగా ప్రకటించారు.

ట్రంప్ ముఖ చిత్రాన్ని కాయిన్స్ మీద ముద్రించడాన్ని అక్కడి విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ కు ప్రచార పిచ్చి పీక్స్ లోకి వెళ్లిందని కామెంట్లు చేస్తున్నారు. అధ్యక్షుడు బతికి ఉండగానే ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడటం ట్రంప్ లో ఉన్న మరో కోణానికి నిదర్శనమని అక్కడికి విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ చర్యను ట్రంప్ సమర్థించుకోవడం విశేషం. గ్లోబల్ మీడియా మాత్రం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తున్నది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper