Homeఅంతర్జాతీయంAfghanistan Minerals : పాకిస్తాన్ దారిలోనే ఆఫ్గనిస్తాన్.. అమెరికా పంట పండుతోంది పో..

Afghanistan Minerals : పాకిస్తాన్ దారిలోనే ఆఫ్గనిస్తాన్.. అమెరికా పంట పండుతోంది పో..

Afghanistan Minerals : ఆ మధ్య అమెరికా కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళాడు గుర్తుందా.. వెళ్తూ వెళ్తూ ఒక పెట్టెలో ఏమో తీసుకెళ్లాడు. అవి ట్రంప్ అనుచరులకు చూపించాడు. అంతే అతనికి ట్రంప్ అపాయింట్మెంట్ లభించింది. వైట్ హౌస్ లో ట్రంప్ తో కలిసి భోజనం చేసే అవకాశం కూడా దక్కింది. దాని వెనుక ఉన్న పరమార్ధం ఏంటయ్యా అంటే.. పాకిస్తాన్లో ఉన్న విలువైన వనరులను వెలికి తీయడానికి.. వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అమెరికా […]

Afghanistan Minerals : ఆ మధ్య అమెరికా కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళాడు గుర్తుందా.. వెళ్తూ వెళ్తూ ఒక పెట్టెలో ఏమో తీసుకెళ్లాడు. అవి ట్రంప్ అనుచరులకు చూపించాడు. అంతే అతనికి ట్రంప్ అపాయింట్మెంట్ లభించింది. వైట్ హౌస్ లో ట్రంప్ తో కలిసి భోజనం చేసే అవకాశం కూడా దక్కింది. దాని వెనుక ఉన్న పరమార్ధం ఏంటయ్యా అంటే.. పాకిస్తాన్లో ఉన్న విలువైన వనరులను వెలికి తీయడానికి.. వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అమెరికా కంపెనీలకు రెడ్ కార్పెట్ పరవడం..

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిన్ మునీర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో అమెరికా కంపెనీలు రెక్కలు కట్టుకొని పాకిస్తాన్లో వాలిపోయాయి. అన్వేషణ మొదలుపెట్టాయి. మరికొద్ది రోజుల్లో అక్కడ విలువైన ఖనిజాలు తవ్వుకొని వెళ్లిపోతాయి. ఎంతో కొంత పాకిస్తాన్ పాలకులకు అమెరికా కంపెనీలు బిచ్చం వేసి వెళ్లిపోతాయి. గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ స్థాయిలో అయితే దోపిడికి పాల్పడిందో.. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో అమెరికా కంపెనీలు దుర్మార్గానికి పాల్పడుతున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ పాలకులు అమెరికా కంపెనీలకు సెల్యూట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్ తరాలను కొంచెం కూడా దృష్టిలో పెట్టుకోకుండా విలువైన వనరులు అమెరికా కంపెనీలకు కట్టబెట్టడం పాకిస్తాన్ పాలకుల దౌర్భాల్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.

పాకిస్తాన్ పాలకుల నెత్తి మాసినతనం అలా ఉంది అనుకుంటే.. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలకులు అంతకుమించిన స్థాయికి దిగజారి పోయారు. నాటో దళాలు వెలిపోయిన తర్వాత ఆఫ్గనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ దేశంలో ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు. పైగా ఆడవాళ్ళ మీద ఆంక్షలు మరింత ఘోరంగా పెరిగిపోతున్నాయి. కేవలం పడక సుఖానికి మాత్రమే ఆడవాళ్లు పనికి వస్తారని అక్కడ కొత్త కొత్త సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ఆర్థికపరంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఆఫ్ఘనిస్తాన్ పరిపాలకులు ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు అమెరికా మీద తిరగబడిన ఆఫ్గనిస్తాన్ పరిపాలకులు.. ఇప్పుడు ఆ దేశం విధించిన ఆంక్షలు నుంచి ఉపశమనం పొందడానికి స్నేహ గీతాన్ని ఆలపిస్తున్నారు. ఇక్కడితోనే ఆగిపోవడం లేదు.. తమ దేశంలో విస్తారంగా ఖనిజ నిలువలు ఉన్నాయని.. వాటిని వాడుకోవాలని.. అమెరికా పెట్టుబడిదారులను ఆఫ్ఘనిస్తాన్ పరిపాలకులు ఆహ్వానిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఈ ఖనిజ వనరుల విలువ దాదాపు 95 లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. మైనింగ్.. అగ్రికల్చర్.. ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ట్రేడ్ విభాగాలలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికా కంపెనీలను ఆహ్వానిస్తున్నామని ఆఫ్గనిస్తాన్ పాలకులు చెబుతున్నారు. అయితే ఆఫ్గనిస్తాన్ దేశానికి సంబంధించిన 9.5 బిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా ఫ్రీజ్ చేసింది. ఆ ఆస్తులను విడిపించుకోవడానికి ఆప్ఘనిస్తాన్ పరిపాలకులు ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper