Homeఅంతర్జాతీయంDonald Trump: ట్రంప్‌ మరో కఠిన నిర్ణయం.. అంతర్జాతీయ విద్యార్థులకు షాక్‌!

Donald Trump: ట్రంప్‌ మరో కఠిన నిర్ణయం.. అంతర్జాతీయ విద్యార్థులకు షాక్‌!

Donald Trump: వలసలను అడ్డుకోవడానికి అమెరికా అధ్యక్షుడు అనేక చర్యలు చేపడుతున్నారు. ఏయే చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తూ.. వరుసగా అమలు చేస్తున్నారు. దీంతో అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, అక్కడే జాబ్‌ చేయాలనుకునే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు. తాజాగా ట్రంప్‌ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు సంబంధించిన కరిక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (సీపీటీ) విధానాలపై కఠిన దృష్టి సారించింది. ఇది అధ్యయన కాలంలోనే ఆచరణాత్మక అనుభవం సంపాదించే అవకాశాలను ప్రభావితం చేస్తోంది. ïసీపీటీ అంటే… ఎఫ్‌–1 వీసా ఉన్న […]

Donald Trump: వలసలను అడ్డుకోవడానికి అమెరికా అధ్యక్షుడు అనేక చర్యలు చేపడుతున్నారు. ఏయే చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తూ.. వరుసగా అమలు చేస్తున్నారు. దీంతో అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, అక్కడే జాబ్‌ చేయాలనుకునే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు. తాజాగా ట్రంప్‌ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు సంబంధించిన కరిక్యులర్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (సీపీటీ) విధానాలపై కఠిన దృష్టి సారించింది. ఇది అధ్యయన కాలంలోనే ఆచరణాత్మక అనుభవం సంపాదించే అవకాశాలను ప్రభావితం చేస్తోంది.

ïసీపీటీ అంటే…
ఎఫ్‌–1 వీసా ఉన్న విద్యార్థులు తమ డిగ్రీ కోర్సుకు అనుబంధంగా ఆఫ్‌–క్యాంపస్‌ ఇంటర్న్‌షిప్‌లు చేసుకోవచ్చు. ఇది కేవలం ఆ కోర్సు పాఠ్యాంశాల్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు, అన్ని విద్యార్థులకు (స్థానికులు, విదేశీయులు సమానంగా) తప్పనిసరిగా ఉన్నప్పుడు మాత్రమే అనుమతి. యజమానులు, విశ్వవిద్యాలయాల మధ్య సహకార ఒప్పందాలు కూడా అవసరం. ఎలక్టివ్‌ కోర్సుల ద్వారా లేదా కేవలం ఉపాధి కోసం మాత్రమే ఆమోదించడం నిబంధనలకు విరుద్ధం.

ప్రభుత్వ హెచ్చరిక..
స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఈవీపీ) ఇటీవలి సమాచారంలో ïసీపీటీ ఆమోదాలు పెరుగుతున్నాయని, కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంది. నియమాలు పాటించని సంస్థలు విదేశీ విద్యార్థులను చేర్చుకునే అనుమతి కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. దీని ఫలితంగా యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా లాస్‌ ఏంజిల్స్, బర్కిలీ వంటి ప్రముఖ సంస్థలు కొన్ని అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసి, మార్గదర్శకాలను పరిశీలిస్తున్నాయి. డిగ్రీకి తప్పనిసరి అయిన శిక్షణను మాత్రమే కొనసాగిస్తున్నాయి.

విద్యార్థులపై ప్రభావం
అధ్యయన సమయంలో ఆచరణాత్మక అనుభవం, ఆదాయం సంపాదించే మార్గం కష్టతరమవుతోంది. చాలా మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా అనుభవం పొంది, తర్వాత ఉద్యోగ అవకాశాలు వెతుకుతుంటారు. తాజా నిర్ణయంతో తాత్కాలిక ఉపాధి దొరకడం కష్టమవుతుంది. ఇది అమెరికా విద్యా వ్యవస్థ ఆకర్షణను కూడా ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే అనేక మంది విదేశీ విద్యార్థులు ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ అవకాశాల కోసం ఈ దేశాన్ని ఎంచుకుంటారు.

ఇది వీసా నియమాలు, ఉపాధి అనుమతులపై వరుస చర్యల్లో భాగం. ప్రభుత్వం దుర్వినియోగాన్ని అరికట్టాలని చెబుతోంది. నిబంధనలు మారలేదని, కానీ కఠిన అమలు జరుగుతుందని స్పష్టం చేస్తోంది. విద్యా సంస్థలు జాగ్రత్తగా పరిశీలించి, అనుమతులు ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా విద్యార్థులు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper