spot_img
Homeఅంతర్జాతీయంNuclear Power Plant: అందమైన జాబిల్లిపై.. అణు విద్యుత్తు

Nuclear Power Plant: అందమైన జాబిల్లిపై.. అణు విద్యుత్తు

Nuclear Power Plant: చందమామ.. ఈ పేరు చెప్తే చిన్నప్పుడు చదువుకున్న కథలు గుర్తుకొస్తాయి. అమ్మ ఒడిలో కూర్చుని జాబిల్లిని చూస్తూ తిన్న గోరుముద్దలు జ్ఞాపకమొస్తాయి. అలాంటి చందమామపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలు మోపిన తర్వాత కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల చంద్రయాన్ ప్రయోగంతో ఇస్రో సరికొత్త విషయాలు వెల్లడించింది. చందమామపై నీటి జాడలు ఉన్నాయని యావత్తు ప్రపంచానికి చెప్పింది. అయితే ఇంతటితోనే చంద్రుడి మీద ప్రయోగాలు ఆగలేదు. తాజాగా రష్యా, చైనా సంయుక్తంగా చందమామపై అణు విద్యుత్ ప్లాంట్ (nuclear power plant) నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. రష్యా కు చెందిన స్పేస్ ఏజెన్సీ రాస్ కాస్మోస్ (Roscosmos) అధిపతి యూరీ బోరిసోవ్ కీలక విషయాలు వెల్లడించారు. చైనాతో కలిసి రష్యా పనిచేస్తుందని ప్రకటించారు. ప్రయోగాల అనంతరం చంద్రుడిపై ఆవాసాలను ఏర్పాటుచేసే రోజులను తీసుకొస్తామని అన్నారు.. చైనాతో తాము చేపట్టబోయే ప్రోగ్రామ్ కు లూనార్ అనే పేరును నిర్ణయించామని బోరిసోవ్ వెల్లడించారు.. తమ అంతరిక్ష సంస్థ సాధించిన అపార నైపుణ్యం న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీకి దోహదం చేస్తుందని వెల్లడించారు. ” 2033-35 నాటికి జాబిల్లిపై అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నాం. ఇందుకు చైనా శాస్త్రవేత్తలతో కలిసి చాలా కీలకంగా పనిచేస్తున్నాం. వచ్చే రోజుల్లో చందమామ మీద ఆవాసాల ఏర్పాటుకు విద్యుత్ అవసరమవుతుంది. ఆ విద్యుత్తు ను సౌర ఫలకలు అందించలేవు. అక్కడ విద్యుత్ అవసరాలు తీరాలంటే న్యూక్లియర్ ఒకటే మార్గం. దాని ద్వారానే అది సాధ్యమవుతుంది. అయితే ఆ న్యూక్లియర్ ప్రాజెక్టు నిర్మాణం మాకు చాలా సవాళ్లతో కూడుకొని ఉంది. ఆ విద్యుత్ తయారీలో మనుషుల ప్రమేయం లేకుండా పూర్తి ఆటోమేటెడ్ విధానాన్ని అవలంబించాల్సి ఉంటుందని” బోరిసోవ్ ప్రకటించారు..

న్యూక్లియర్ ప్రాజెక్టు సంబంధించి చైనా, రష్యా ఎంత పెట్టాయనేది తెలియ రాలేదు. ఇక న్యూక్లియర్ రియాక్టర్ ను కూల్ చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేపడుతున్నారు. ఈ ప్రయోగాలలో ఎదురైన సవాళ్ళకు శాస్త్రవేత్తలు పరిష్కార మార్గం కనుగొన్నారు. దీనికి సంబంధించి స్పేస్ టగ్ బోట్ పై వారు పనిచేస్తున్నారు.. దీని ద్వారా అంతరిక్షంలోని ఒక కక్ష్య నుంచి మరొక కక్ష్యలోకి భారీ కార్గోను రవాణా చేస్తారు. అంతరిక్ష వ్యర్ధాలను కూడా సేకరిస్తారు. ఇన్ని బహుళ పనులు చేసే విధంగా దానిని నిర్మిస్తున్నారు.

మరోవైపు చైనా, రష్యా రూపొందిస్తున్న అణు విద్యుత్ ప్రాజెక్టుపై అమెరికా స్పందించింది. “అంతరిక్షంలో విధ్వంసకరమైన ఆయుధాన్ని రష్యా తయారు చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఆ ఆయుధాన్ని ఇంకా రష్యా మోహరించలేదు. ప్రస్తుతానికి ఎటువంటి ముప్పలేదు. దీనిపై ఎప్పటికప్పుడు దృష్టిసారిస్తున్నామని” అమెరికా ప్రకటించింది. అమెరికా ప్రకటన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. న్యూక్లియర్ వెపన్స్ ను అంతరిక్షంలో ఏర్పాటు చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. ఆయన ఆ ప్రకటన చేసిన తర్వాత రష్యా స్పేస్ ఏజెన్సీ.. న్యూక్లియర్ స్పేస్ ఎనర్జీ పై సంచలన విషయం వెల్లడించడం విశేషం.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
Oktelugu Epaper