Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా అల్లు అర్జున్(Allu Arjun) అభిమానుల్లో కలుగుతున్నాయి.
పుష్ప మొదటి పార్ట్ మీద భారీ అంచనాలు ఉండడం వల్లే తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కాబట్టి పుష్ప 2 సినిమాకి కూడా ఆ అంచనాల వల్లే డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా అన్నట్టుగా సినిమా యూనిట్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు రిలీజైన గ్లిమ్స్ తో ఈ సినిమా మీద ఆటోమేటిక్ గా ప్రేక్షకుల్లో అంచనాలైతే భారీ స్థాయి లో పెరిగాయి.
ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా మీద అంచనాలను తగ్గించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసమే ఒక నార్మల్ టీజర్ ని రిలీజ్ చేసే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పెరుగుతున్న అంచనాలను తగ్గించాలని సినిమా యూనిట్ మొత్తం ఏం చేయాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలాగైనా సూపర్ హిట్ సాధించాలని అటు సుకుమార్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరు కూడా భారీ అంచనాలతో అయితే ఉన్నారు.
ఎందుకంటే ఇప్పటికే పుష్ప సినిమాతో వీళ్ళకి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు వచ్చింది. అలాగే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. కాబట్టి ఈ సినిమాని ఎలాగైనా సక్సెస్ చేసి వీళ్ళది సక్సెస్ ఫుల్ కాంబో అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ సినిమా మీద అంచనాలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు…