The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం వచ్చే నెల 24వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా నుంచి నిన్న ‘యేసేనాగుల కట్టమీద వేసిన ఉయ్యాల’ అంటూ ఒక సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాతో పాటు సినిమా కథ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండడంతో ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుందని దర్శక నిర్మాతలైతే భావిస్తున్నారు… ఇక ఈ స్పెషల్ సాంగ్ లో నానితోపాటు కీర్తి సురేష్ ఆది పాడింది. దానికి తగ్గట్టుగానే ఆమె గ్రేస్ కూడా ఈ సాంగ్లో చాలా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది.
కీర్తి సురేష్ కేవలం సాంగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సాంగ్ తర్వాత సినిమాలో కూడా కొంతవరకు భాగం అవుతుందట. నాని ని నమ్మించి మోసం చేసే క్యారెక్టర్ లో కీర్తి సురేష్ చివర్లో ఒక చిన్న పాత్రలో కనిపించి వెళ్ళిపోతుందట. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా దసర సినిమాలో నాని కీర్తి సురేష్ కలిసి నటించారు.
అలాగే శ్రీకాంత్ ఓదెల మరోసారి వీళ్ళిద్దరిని తన సినిమాలో భాగం చేయడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల రాబోయే రోజుల్లో టాప్ డైరెక్టర్ గా మారాలంటే మాత్రం ప్యారడైజ్ సినిమా భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే ప్రమాదం ఉంది.
ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తుంది. లేకపోతే మాత్రం ఆయనకు చిరంజీవి నుంచి అవకాశం వచ్చే ఛాన్స్ లేదు. సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది…