Nepal Bank Locker : నేపాల్ దేశం ఆకస్మిక వరదలతో అల్లాడిపోతోంది. ఊహించని ఈ ఫ్లూడ్ కారణంగా దాదాపు550 కి పైగానే మంది చనిపోయినట్లు సమాచారం.. ఇదే సమయంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇందులో భాగంగా పెద్ద పెద్ద భవనాలు.. వాహనాలు కొట్టుకుపోయాయి. అయితే ఇదే సమయంలో ఓ బ్యాంకుకు సంబంధించిన లాకర్ కొట్టుకుపోయింది. దీనిని కొందరు గుర్తించి అందులోని డబ్బును తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితులను పట్టుకున్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
దాడింగు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రసువా జిల్లాలోని బోటే కోసి ప్రాంతంలో ఆకస్మికంగా వరదలుమించాయి. ఇక్కడ ఉన్న నదీ తీరంలో ఓ బ్యాంకు లాకర్ కొట్టుకు వచ్చింది. అయితే దీనిని చూసిన కొందరు స్థానికులు ఆ లాకర్ను ఓపెన్ చేసి చూశారు. అందులో భారీగా డబ్బు కనిపించింది. దీంతో వారు దానిని తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానిస్తున్న 29 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా భారీ వద్ద నుంచి 92 లక్షల నేపాలి కరెన్సీ (రూ.57 లక్షలు)ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఒకవైపు వరదలతో చాలామంది తిండి దొరకని పరిస్థితులు ఏర్పడుతున్న సమయంలో మరికొందరు ఇదే అతనిగా భావించి డబ్బును తస్కరించే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోని పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే బ్యాంకులో లాకర్లో ఎంత డబ్బుంది? ఇది ఏ బ్యాంకుకు సంబంధించింది? అనే విషయం ఇంకా తెలియ రాలేదు. కానీ మరి ఇక్కడ అయినా ఇలా ప్రభుత్వ సొమ్మును దొంగిలించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు ఈ వరదలతో భారీగా భవనాలు, వస్తువులు కొట్టుకుపోయాయి. దీంతో వేలమంది నిరాశ్రయులు అయ్యారు. వారికి సహాయం అందించేందుకు ఇప్పటికే భారత్ ముందుకు కదిలిన విషయం తెలిసిందే. ఇక గల్లంతయిన వారికోసం ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. నేపాల్లో ఇప్పటికే తెలుగువారి 52 మంది చిక్కుకుంటున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. వీరిలో కొందరిని సేవ్ చేయగా మరికొందరి వారి కోసం గాలిస్తున్నారు.