Nepal Floods : ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది.. యూరప్ నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు తీవ్రమైన కరువు నెలకొంది. ఎన్నడు ఉష్ణోగ్రతలను ఈ స్థాయిలో చూడలేదని యూరప్ వాసులు అంటున్నారు. అక్కడ హీట్ వేవ్ తీవ్రంగా ఉంది. వేడికి తట్టుకోలేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
సముద్ర ఉపరితలలో ఏర్పడిన పరిస్థితుల వల్ల ప్రపంచంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలలో తీవ్రమైన కరువు ఉంటే.. మరి కొన్ని ప్రాంతాలలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. మన దేశానికి సరిహద్దుల్లో ఉన్న నేపాల్ దేశంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. హిమాలయాలకు సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. టిబెట్ నుంచి నేపాల్ దేశానికి విపరీతంగా వరదలు వస్తున్నాయి. ముఖ్యంగా నేపాల్ దేశంలోని బోటే కోసి నదిలోకి భారీగా వరద ప్రవాహం వచ్చింది. దీంతో త్రిశూలి పరివాహక ప్రాంతం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. బోటే కోసి నది నుంచి ప్రవాహం ఆదినారాయణి , నది మీదుగా బీహార్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ప్రవాహం గంగా నదిలో కలిస్తే అప్పుడు బీహార్ రాష్ట్రం తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటుంది.
గంగా నది ప్రవాహం పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్, సారన్, వైశాలి ప్రాంతాలలో తీవ్రంగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో.. హిమాలయ నది పరివాహక ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు కురిసాయి. ముఖ్యంగా అస్సాం రాష్ట్రం చాలా రోజులపాటు వరదలలో చిక్కుకుపోయింది.. ఇక మిగతా రాష్ట్రాలలో కూడా అదే స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం విపరీతంగా చోటుచేసుకుంది. ఈ వర్షాల నుంచి ఇంకా ఈశాన్య రాష్ట్రాలు.. హిమాలయాల పరిధిలో ఉన్న రాష్ట్రాలు ఇంకా కోలుకోలేదు. కాకపోతే మిగతా రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో మనదేశంలో భిన్నమైన వాతావరణం ఈసారి కనిపిస్తోంది. అయితే నేపాల్ దేశంలో విపరీతంగా వరదలు వస్తున్న నేపథ్యంలో.. భారతదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాలలోని రాష్ట్రాలు.. గంగా నది ప్రవహించే రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గంగానది మనదేశంలో హిమాలయ పరిధిలో ఉన్న రాష్ట్రాలలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవాహం తీవ్రంగా ఉంటే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందువల్లే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
గంగా నది మనదేశంలో ఉదృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. దీని ప్రవాహ తాకిడికి గతంలో మన దేశంలో అనేక రాష్ట్రాలలో నష్టం విపరీతంగా చోటుచేసుకుంది. గంగా నది ప్రవహించే రాష్ట్రాలు మనదేశంలో అధికంగా ఉన్నాయి. పైగా వర్షాకాలంలో గంగానదికి ప్రవాహం విపరీతంగా వస్తూ ఉంటుంది. హిమాలయ పరివాహక ప్రాంతాలలో ఏమాత్రం వర్షం కురిసినా సరే గంగా నది విస్తారంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్లే ఆ నది ప్రవహించే రాష్ట్రాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు వ్యక్తం అవుతున్నాయి
నేపాల్‌ను ముంచెత్తిన వరదలు, 9 మంది మృతి
కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు
105 మంది భారతీయులు గల్లంతు
మొత్తం 291 మంది పర్యాటకులు గల్లంతు
#Nepal #Rains #Floods pic.twitter.com/tT1LgQgo6m— TV9 Telugu (@TV9Telugu) August 26, 2026