Homeఆంధ్రప్రదేశ్‌Roja Nepal Visit: రోజా నేపాల్ వెళ్లారా.. ఇది ఎక్కడి మాస్ ర్యాగింగ్ రా బాబు

Roja Nepal Visit: రోజా నేపాల్ వెళ్లారా.. ఇది ఎక్కడి మాస్ ర్యాగింగ్ రా బాబు

Roja Nepal Visit ఏదైనా ఒక ముద్ర ఒకరిపై పడిందో.. అది అంత త్వరగా చెరగదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజాపై కూడా అదే. ఎక్కడ ఏ పరిణామం జరిగినా.. దానిని రోజాకు లింక్ చేస్తూ ప్రచారం చేయడం ప్రత్యర్థులకు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అలవాటైన విద్య. ఇప్పుడు నేపాల్ లో వరదలు వచ్చాయి. దాదాపు 300 మందికి పైగా కేవలం భారతీయులే గల్లంతయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పది రోజుల కిందట […]

Roja Nepal Visit ఏదైనా ఒక ముద్ర ఒకరిపై పడిందో.. అది అంత త్వరగా చెరగదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజాపై కూడా అదే. ఎక్కడ ఏ పరిణామం జరిగినా.. దానిని రోజాకు లింక్ చేస్తూ ప్రచారం చేయడం ప్రత్యర్థులకు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అలవాటైన విద్య. ఇప్పుడు నేపాల్ లో వరదలు వచ్చాయి. దాదాపు 300 మందికి పైగా కేవలం భారతీయులే గల్లంతయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పది రోజుల కిందట రోజా సైతం నేపాల్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అవి సానుకూలంగా కాదు. వ్యతిరేకంగా ఉండడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రోజా అడుగుపెడితే అలా ఉంటాది అన్నట్టు చూపే ప్రయత్నం చేస్తున్నారు.

* గతంలో చాలా సార్లు..
గతంలో చాలా సందర్భాల్లో మాజీ మంత్రి రోజాకు వ్యతిరేకంగా ఇటువంటి ట్రోల్స్ చూశాం. మొన్నటికి మొన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఆమె డీఎంకేకు మద్దతుగా ప్రచారానికి వెళ్లారు. కచ్చితంగా గెలుస్తుంది అనేది డిఎంకెపై ఉన్న అభిప్రాయం. మెజారిటీ సర్వేలు కూడా అలానే చెప్పాయి. కానీ అక్కడ డీఎంకే ఓడిపోయి విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చింది. అది మొదలు రోజాకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో. రీల్స్ తో పాటు మీమ్స్ లో ఓ రేంజ్ లో వేసుకున్నారు నెటిజన్లు. అది చాలాదన్నట్టు డీఎంకేకు ప్రచారానికి వెళ్లిన రోజా టీవీ కే విజయాన్ని ఆహ్వానించడం.. జగన్మోహన్ రెడ్డి వల్లే అది సాధ్యమైందని చెప్పడంతో మరింత ట్రోల్స్ కు గురయ్యారు. అది ఒక్కటే కాదు చాలా సందర్భాల్లో కూడా రోజా ఇలాంటి ట్రోల్స్ కు గురి కావడం కామన్ గా మారింది.

* ఆమె లెగ్ ఫలం అంటూ..
నేపాల్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వరదలకు ఆదేశం అతలాకుతలం అయింది. కళ్ళముందే భారీ భవంతులు కొట్టుకుపోయాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతులేని ఆస్తి నష్టం జరిగింది. ఇటువంటి సమయంలో ప్రపంచం మొత్తం నేపాల్ పై సానుభూతి చూపిస్తోంది. సహాయ చర్యలకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇటువంటి తరుణంలో నేపాల్ లో ఈ పరిస్థితికి మాజీ మంత్రి రోజా కారణం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. పది రోజుల కిందట నేపాల్ లో ఆలయాల సందర్శనకు రోజా వెళ్లారని.. ఆమె వచ్చిన తర్వాత ఆమె లెగ్ ఫలితంగా ఈ జలప్రళయం చోటుచేసుకుంది అనేది సోషల్ మీడియా పోస్టుల సారాంశం. విపరీతంగా ఈ పోస్టులు వైరల్ అవుతుండడం విశేషం.

 

View this post on Instagram

 

A post shared by Thaggedhe Ley (@thaggedhee_ley)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper