Pavithra Gowda: తాత్కాలిక సంబంధాలు.. తాత్కాలిక మోహాలు ఎప్పటికైనా సరే అత్యంత ప్రమాదకరం. వయసు వేడిలో.. కోరికల సెగలో చాలామంది అదుపు తప్పుతారు. పెడదారులు పడతారు. ఆ ఉద్రేకంలోనే ఘోరాలకు పాల్పడతారు. చివరికి చట్టం ముందు.. న్యాయం ముందు తలవంచుకొని నిలబడతారు. ఇటువంటిదే ఈమె స్టోరీ కూడా.
ఆమె పేరు పవిత్ర గౌడ.. కర్ణాటకలో ఫేమస్ యాక్టర్. అందానికి అందం.. సౌష్టవానికి సౌష్టవం ఈమె సొంతం. వాస్తవానికి ఈమె కర్ణాటక చిత్ర పరిశ్రమలో నటుడు దర్శన్ తో రిలేషన్ పెట్టుకుంది. అది కాస్త పెద్ద దుమారంగా మారింది. ఈ నేపథ్యంలో తన అభిమాన హీరో వ్యక్తిగత జీవితాన్ని సర్వనాశనం చేయదని రేణుక స్వామి అనే వ్యక్తి పవిత్ర గౌడ కు మెసేజ్ చేసేవాడు. ఆ తర్వాత కొన్ని ఫోటోలను కూడా పంపించాడు. అతని వేధింపులు పెరిగిపోవడంతో ఈ విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్ కు చెప్పింది. దర్శన్ కిరాయి గుండాలతో రేణుక స్వామిని హత్య చేయించాడు. ఆ తర్వాత ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది.
పోలీసులు అన్ని ఆధారాలు సేకరించి దర్శన్.. పవిత్ర గౌడను.. ఇంకా కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పవిత్ర గౌడను కర్ణాటకలోని ఒక జైల్లో ఉంచారు. అయితే ఆమె ఉన్న బ్యారక్ లో నైజీరియా దేశానికి చెందిన నేరస్థులు కూడా ఉన్నారు. పవిత్ర గౌడను నైజీరియా దేశానికి చెందిన నేరస్తులు వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె తన తరఫు లాయర్ల ద్వారా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలో న్యాయస్థానం ఆమె వినతిని తిరస్కరించింది. ఆ తర్వాత మళ్లీ బెయిల్ విచారణ వచ్చినప్పుడు ఈసారి పవిత్ర గౌడ న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకుంది. తాను ఈ బతుకు బతకలేక పోతున్నానని.. తనకు ఇంత విషం ఇచ్చి చంపాలని వేడుకొంది. నైజీరియా నేరస్తుల తాకిడికి తట్టుకోలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వం తరఫున లాయర్లు ఈ వ్యవహారంపై స్పందించారు. నైజీరియా నేరస్తుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆమెను వేరే బ్యారక్ లోకి మార్చామని ప్రకటించారు. దీంతో బెయిల్ పిటిషన్ పై న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
పవిత్ర గౌడ దర్శన్ జీవితంలోకి రావడంతో ఆయన ఈ నేరం చేయాల్సి వచ్చిందని అభిమానులు వాపోతున్నారు. దర్శన్ కు కర్ణాటకలో బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన అనేక విజయవంతమైన సినిమాలలో నటించారు. వ్యక్తిగతంగా దర్శన్ దూకుడును కలిగి ఉంటారు. అందువల్లే పవిత్ర గౌడ విషయంలో కూడా ఆయన ఇదే ధోరణి ప్రదర్శించారు. చివరికి జైలు పాలయ్యారు. ఒక సెలబ్రిటీగా సమాజానికి ఆదర్శవంతంగా ఉండాల్సిన దర్శన్.. చాటు మాటు సంబంధం కోసం ఘోరానికి పాల్పడ్డారు. చివరికి తన జీవితాన్ని అన్యాయం చేసుకున్నారు. అభిమానుల దృష్టిలో.. సమాజం దృష్టిలో తలవంచుకొని నిలబడుతున్నారు. ఇంతకంటే దారుణం.. ఇంతకంటే ఘోరం ఏ సెలబ్రిటీకి ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.