Tamil Nadu: రాత్రి అయితే చాలు వింత ఆకారాలు.. వింత శబ్దాలు.. అడుగు బయట పెడదామంటే చాలు వెన్నులో వణుకు. అత్యవసరమై ఏదైనా పనికి వెళ్లాలంటే కష్టమే . ఇంట్లో ఉన్నా సరే భయమే. పొరపాటున ఒంటరిగా ఉంటే.. ఎక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనే.. ఇలాంటి భయాల మధ్య.. ఇలాంటి ఆందోళనల మధ్య అక్కడి ప్రజలు జీవిస్తున్నారు. చదువుతుంటే ఏదో దయ్యాల స్టోరీ లాగా ఉంది కదా.. సినిమా మాదిరిగా అనిపిస్తోంది కదా.. ఇదంతా నిజమే.. నేటి సాంకేతిక కాలంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం.
ఏదైనా ఒక ప్రాంతంలో దయ్యాలు సంచరిస్తున్నాయి అంటే చాలామంది నమ్మరు. పైగా తేలిగ్గా కొట్టి పారేస్తుంటారు. వాస్తవానికి ఇటువంటి వ్యవహారాలు సినిమాలలో చూసేందుకు మాత్రమే బాగుంటాయని.. నిజ జీవితంలో దయ్యాలకు ఆస్కారం లేదని.. అటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అగత్యం ఉండకూడదని విద్యావేత్తలు చెబుతుంటారు. కానీ తమిళనాడులోని వేలూరు జిల్లా లో ఓ గ్రామంలో మాత్రం అక్కడి ప్రజలు విద్యావేత్తల విశ్లేషణలను తప్పు పడుతున్నారు. పైగా తమ గ్రామంలో రాత్రిపూట దయ్యాలు తిరుగుతున్నాయని వారు సాక్షాలతో సహా నిరూపిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా లోని నెమంతపురం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో రాత్రి సమయంలో మనుషుల సంచారం తగ్గిపోయిన తర్వాత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. విచిత్రమైన ఆకారాలు కనిపిస్తున్నాయి.. ఇటీవల నెమంతపురం ప్రాంతానికి చెందిన పాల వ్యాపారి తన్వీర్ వర్షం కురుస్తుంటే ఆ దృశ్యాలను ఫోటోలు తీశాడు. అక్కడి కొబ్బరి చెట్టు వద్ద ఎంత ఆకారం ఉన్నట్టు ఫోటోలో నమోదయింది. దీంతో అతడు ఆందోళన చెంది దగ్గరికి వెళ్లి పరిశీలించగా అక్కడ అలాంటిది ఏమీ కనిపించలేదు. మరుసటి రోజు తన్వీర్ ఇదే విషయాన్ని గ్రామంలో ప్రజలకు చెప్పాడు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు.. సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఫలితంగా గ్రామస్తులు ఇండ్ల నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. రాత్రి సమయంలో తమ గృహాలకు తాళాలు వేసుకొని లోపల ఉండి పోతున్నారు.
కొబ్బరి చెట్టు మీద ఉన్న ఆ వింత ఆకారాన్ని చూసి చాలామంది ఆందోళన చెందుతున్నారు. తన్వీర్ ఫోటో తీయడం కంటే ముందు గ్రామంలో రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయని.. వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయని గ్రామాలు తమకే ఎదురైన అనుభవాలను చెబుతున్నారు. వాస్తవానికి నేటి కాలంలో దయ్యాలు అనేవి ఉండవని.. అదంతా కేవలం భ్రమ మాత్రమేనని విద్యావేత్తలు అంటున్నారు. దయ్యాలు అనేవి ఉండవని.. మనిషి చనిపోయిన తర్వాత నిర్జీవమైన శరీరం మాత్రమే ఉంటుందని.. ఆ శరీరాన్ని కూడా రకరకాల విధానాలలో భూమ్మీద లేకుండా చేస్తారని.. ఇందులో దయ్యంగా మారడానికి ఆస్కారం ఎక్కడిదని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.