Homeసినిమా వార్తలుShakeela: షకీలా కి పెళ్లయిందా.. కుమార్తె కూడా ఉందా.. ఫ్యూజులు ఎగిరిపోయాయి కదరా

Shakeela: షకీలా కి పెళ్లయిందా.. కుమార్తె కూడా ఉందా.. ఫ్యూజులు ఎగిరిపోయాయి కదరా

Shakeela: ఒక జానర్ సినిమాల్లో నటించి.. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ అభిమానులను సృష్టించుకున్న నటి షకీలా. ఈమె సినిమాలు ఒక వర్గం వాళ్ళని విపరీతంగా ఆకట్టుకునేవి. పై ఆమె కూడా అటువంటి సినిమాలలోనే నటించేవారు. ఆ సినిమాల ద్వారానే ఆమె తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు. ఆ తరహా సినిమాలలో నటించి భారీగా సంపాదించిన షకీలా.. ఆ తర్వాత సొంత బంధువులే మోసం చేయడంతో రోడ్డున పడ్డారు. ఆ తర్వాత మళ్లీ తేరుకున్నారు. అయినవాళ్ళకు దూరంగా.. ఒక […]

Shakeela: ఒక జానర్ సినిమాల్లో నటించి.. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ అభిమానులను సృష్టించుకున్న నటి షకీలా. ఈమె సినిమాలు ఒక వర్గం వాళ్ళని విపరీతంగా ఆకట్టుకునేవి. పై ఆమె కూడా అటువంటి సినిమాలలోనే నటించేవారు. ఆ సినిమాల ద్వారానే ఆమె తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు.

ఆ తరహా సినిమాలలో నటించి భారీగా సంపాదించిన షకీలా.. ఆ తర్వాత సొంత బంధువులే మోసం చేయడంతో రోడ్డున పడ్డారు. ఆ తర్వాత మళ్లీ తేరుకున్నారు. అయినవాళ్ళకు దూరంగా.. ఒక ఇంట్లో షకీలా ఉంటున్నారు. అయితే ఇటీవల ఆమె ఒక వీడియో విడుదల చేశారు. తన కూతుర్ని ఆమె ప్రపంచానికి పరిచయం చేశారు. దీంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది. వాస్తవానికి షకీలాకు వివాహం కాలేదు. అలాంటప్పుడు అమ్మాయి ఎలా పుట్టింది.. ఆమె ఎవరు.. అనే విషయాలను ఆరా తీస్తే.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పలు కథనాల ద్వారా షకీలా కు వివాహం కాలేదని తెలుస్తోంది. షకీలా తన కూతురుగా పరిచయం చేసిన ఆ వ్యక్తి పేరు మిల్లా.. మిల్లాను షకీలా చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. మిల్లా ఒక ట్రాన్స్ జెండర్. ఇదే విషయాన్ని షకీలా స్వయంగా వెల్లడించారు. 2021లో తమిళ టీవీ ఛానల్లో కుక్కు విత్ కోమలి అనే కార్యక్రమంలో షకీలా తన కూతుర్ని పరిచయం చేశారు. సినిమా రంగంలో మిల్లా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.

షకీలా కు కష్టాలు ఎదురైనప్పుడు మిల్లా అండగా నిలిచారు. అయితే షకీలాకు వివాహం జరిగింది.. వైవాహిక బంధం ద్వారా ఆమెకు కూతురు పుట్టింది అనేది పూర్తిగా అబద్ధం. మిల్లా అనేక తమిళ సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా మారిపోయింది.. పలానా కారణంతో ఆమెను షకీలా దత్తత తీసుకోలేదు. ట్రాన్స్ జెండర్ సమాజం మీద తనకు ఉన్న అభిప్రాయం వల్లే మిల్లాను దత్తత తీసుకున్నట్టు షకీలా ప్రకటించింది. ” . ఆమెను దత్తత కూతురిగా స్వీకరించాను. ట్రాన్స్ జెండర్ వ్యక్తులపై సమాజంలో పక్షపాతాలు ఉన్నాయి. అందువల్లే తాను ఆ నిర్ణయం తీసుకున్నట్టు” షకీలా వెల్లడించింది. కాగా, మిల్లా ను కూతురు లాగా పెంచిన షకీలా.. తనకంటూ ఒక తోడును సృష్టించుకుంది. ఆమెనే లోకంగా షకీలా బతుకుతోంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది ఒకప్పటికాలం నాటి ఆ తరహా సినిమాల నటి షకీల.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper