Kotamreddy Sridhar Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు అడుగడుగునా అవమానాలు జరిగాయని మాజీ నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మొన్న మధ్యన 2 పేజీల లేఖ రాసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. తనకు వైసీపీలో 73 సార్లు అవమానం జరిగిందంటూ లెక్క కట్టి మరీ చెప్పారు. అంతటితో ఆగకుండా తనపై సజ్జల రామకృష్ణారెడ్డి భౌతిక దాడికి ప్రయత్నించారు అని కూడా ఆరోపించారు. పార్టీ ప్లీనరీలో ఎవరు మాట్లాడుతారు అనే జాబితా తయారు చేసే క్రమంలో తనపై దూకుడుగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. అయితే సజ్జల తనను కొట్టారని.. జగన్మోహన్ రెడ్డికి తెలిసినా పట్టించుకోలేదని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే ఎందుకు కొట్టారో మాత్రం స్పష్టంగా చెప్పలేదు. అయితే అప్పట్లో వైసీపీలోనే ఉన్న ప్రస్తుత నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు కొట్టేందుకు ప్రయత్నించారు బయటపెట్టారు.
* ప్లీనరీలో భారీ ఘర్షణ..
తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2022లో మంగళగిరిలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి పై దాడి చేసింది ముమ్మాటికి నిజమేనని స్పష్టం చేశారు. ప్లీనరీ వేదిక పై ప్రసంగాల నిర్వహణ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగిందని కోటంరెడ్డి పేర్కొన్నారు. సభా వేదిక పైనుంచి ఎవరితో మాట్లాడించాలి? ఈ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలి? అనే అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుందని తెలిపారు. ఇద్దరూ కీలక నేతలు కావడంతో మాట నెగ్గాలనే పట్టుదలతో వ్యవహరించడంతోనే అప్పట్లో విభేదాలు భగ్గుమన్నావని వివరించారు. ఈ వివాదం ముదిరి ఇరుపక్షాల మధ్య మాట పెరిగిందని.. తీవ్ర ఆగ్రహవేశాల క్రమంలోనే విజయసాయిరెడ్డి పై సజ్జల రామకృష్ణారెడ్డి చేయి చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
* క్రమశిక్షణారాహిత్యం అధికమే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంత క్రమశిక్షణ ఉంటుందని అంతా చెబుతారని.. కానీ తెర వెనుక మాత్రం ఆధిపత్య పోరు, ఘర్షణలు సాగాయని అప్పట్లో ఆ పార్టీలో ఉన్న కోటంరెడ్డి బయట పెట్టడం విశేషం. పేరుకే నేతల మధ్య ఐక్యం కాని.. తెర వెనుక నేతలు మధ్య భౌతిక దాడుల స్థాయికి విభేదాలు చేరాయని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని బయట పెట్టేసరికి చాలామంది నమ్మలేదు. పైగా సజ్జన సౌమ్యుడు అంటూ ఎక్కువ మంది చెప్పుకొచ్చారు. దాడి చేస్తే మనస్తత్వం ఆయనది కాదు అంటూ కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరైతే జగనే దాడి చేసి ఉంటారని.. ఆ మాట చెప్పలేక విజయసాయిరెడ్డి సజ్జల పైకి నెట్టేసారని అంటున్నారు. కానీ ఆ సమయంలో వైసీపీలోనే ఉన్న కోటంరెడ్డి ఈ విషయం బయట పెట్టడంతో అసలు విషయం తెలుస్తోంది.
View this post on Instagram