SCO Summit: పాకిస్తాన్ చైనా తో అంట కాగడం ఇదే తొలిసారి కాదు. భారత్ తో కొనసాగుతున్న వైరాన్ని.. చైనా ముందు ఏ కరువు పెట్టి అనేక సందర్భాలలో ఆర్థిక సహాయం పొందింది పాకిస్తాన్. తమ దేశంలో ఉన్న విలువైన వనరులు.. రోడ్లు.. నౌకాశ్రయాలు వంటి వాటి విషయంలో పాకిస్తాన్ చైనాకు ఓపెన్ యాక్సిస్ ఇచ్చేసింది.
చైనా గురించి పాకిస్తాన్ కు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే చైనా తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది. ఎక్కడి దాకైనా వెళ్తుంది. అవసరమైతే నమ్మిన దేశాలను నట్టేట ముంచడానికి కూడా చైనా వెనుకాడదు. చైనా తో స్నేహం అంటే దృతరాష్ట్ర కౌగిలి అని వర్తమాన విశ్లేషకులు చెబుతుంటారు. ఆ విషయం పాకిస్తాన్ కు తెలుసు. కాకపోతే తెలిసినప్పటికీ కూడా ఏమి చేయలేదు. పైగా ఇటీవల పాకిస్తాన్ పాలకుల వ్యవహార శైలి చైనాకు ఏమాత్రం నచ్చడం లేదు. అందువల్లే చైనా పాకిస్తాన్ పాలకులను దూరం పెడుతోంది.
ప్రస్తుతం షాంగై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు నడుస్తోంది. ఈ సదస్సుకు భారత నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాకిస్తాన్ ప్రధానమంత్రి.. రష్యా అధ్యక్షుడు పుతిన్.. చైనా అధినేత జిన్ పింగ్ హాజరయ్యారు. ఇటీవల కాలంలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో మోడీకి చైనా అంతర్జాతీయ వేదికల ముందు తలవంచక తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే చైనా అధినేత.. భారత ప్రధానమంత్రి తో కలివిడిగా ఫోటోలు దిగారు. వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిని చైనా అధినేత పట్టించుకోలేదు. పైగా ఒక చీడ పురుగును చూసినట్టు చూశారు.
అంతర్జాతీయ వేదికల ముందు ఇది ఒక దేశ అధినేతకు తట్టుకోలేని పరాభవం. అందువల్లే మీడియా ముందు కవర్ చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేశారు. ఒక దశలో పుతిన్ ఇష్టపడకపోయినప్పటికీ ఆయనకు దగ్గరగా వెళ్లి ఫోటోలు దిగాలని ప్రయత్నించారు. వాస్తవానికి రష్యా అధినేత పుట్టినరోజు రిజర్వుగా ఉంటారు.. పాకిస్తాన్ ప్రధానమంత్రిని పెద్దగా పట్టించుకోలేదు. అంతేకాదు ఒకరకంగా అనామక వ్యక్తిని చూసినట్టు చూసి.. వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాకిస్తాన్ ప్రధానికి ఇంతకంటే ఘోరమైన అవమానం మరొకటి ఉండదని.. ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు తమ తీరు ఏమిటో తెలుసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు మారతారా.. ఉగ్రవాదాన్ని పక్కనపెట్టి మనుషులుగా నడుచుకుంటారా..
SHOCKING Pakistan PM Shehbaz Sharif rushed to meet Vladimir Putin as soon as the SCO group photo ended
Putin ignored him and moved ahead
pic.twitter.com/4PIT874n5l— News Algebra (@NewsAlgebraIND) September 1, 2026