Homeఅంతర్జాతీయంBRICS summit: కారులో పుతిన్ తో.. మోడీతో దౌత్యం అలా ఉంటుంది మరి..

BRICS summit: కారులో పుతిన్ తో.. మోడీతో దౌత్యం అలా ఉంటుంది మరి..

BRICS summit: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఓ సినిమాలో డైలాగ్ ఇది. దీనిని వాస్తవ రూపంలో చూపించినవాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. దేశ ప్రయోజనాల విషయంలో.. ముఖ్యంగా దౌత్యపరమైన విషయంలో నరేంద్ర మోడీ ఏమాత్రం వెనుకడుగు వేయరు. అంతటి అమెరికా కావచ్చు.. పాకిస్తాన్ కావచ్చు (అప్పట్లో వెళ్లి వచ్చారు).. ఇంకో దేశమైనా కావచ్చు.. నరేంద్ర మోడీ ఒకసారి రంగంలోకి దిగితే పరిస్థితి […]

BRICS summit: కళ్ళు ఉన్నవాడు ముందు చూస్తాడు. దిమాక్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఓ సినిమాలో డైలాగ్ ఇది. దీనిని వాస్తవ రూపంలో చూపించినవాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు.

దేశ ప్రయోజనాల విషయంలో.. ముఖ్యంగా దౌత్యపరమైన విషయంలో నరేంద్ర మోడీ ఏమాత్రం వెనుకడుగు వేయరు. అంతటి అమెరికా కావచ్చు.. పాకిస్తాన్ కావచ్చు (అప్పట్లో వెళ్లి వచ్చారు).. ఇంకో దేశమైనా కావచ్చు.. నరేంద్ర మోడీ ఒకసారి రంగంలోకి దిగితే పరిస్థితి మారిపోతుంది. అప్పటిదాకా భారత్ మీద కారాలు మీరాలు నూరిన వారు సైలెంట్ అయిపోతారు. నరేంద్ర మోడీ మాటల్లో లౌక్యం ఉంటుంది. చేతల్లో చాకచక్యం ఉంటుంది. చివరికి దేన్నైనా సరే చేతుల్లోకి తీసుకునే సత్తా ఉంటుంది. అందువల్లే భారతదేశంతో నేడు ప్రపంచ దేశాలు మైత్రి కోరుకుంటున్నాయి. భారత్ తో వ్యాపారాలు చేస్తున్నాయి.

భారత్ ఆతిథ్యం ఇస్తోంది

ప్రస్తుతం జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగోసారి. నరేంద్ర మోడీ నాయకత్వంలో బ్రిక్స్ కూటమిలోకి అనేక దేశాలు వచ్చాయి. ఇందులో రష్యా కూడా ఉంది. రష్యా అధినేత పుతిన్ ఈ సదస్సులో పాల్గొడానికి ఒకరోజు ముందుగానే ఢిల్లీ వచ్చారు. తనకు కేటాయించిన హోటల్ కు వెళ్లడానికి ముందుగానే నరేంద్రమోడీ అక్కడికి వచ్చారు. పుతిన్ ను చూడగానే చిరునవ్వు చిందించారు. చిరకాల మిత్రుడితో మాట్లాడినట్టు మాట్లాడారు. ఇద్దరు కొద్ది సేపు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత కలిసి ముందుకు సాగారు. వీరిద్దరి భేటీ గురించి అమెరికన్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రసారం కావడం విశేషం.

పుతిన్ ఢిల్లీకి రాగానే

పుతిన్ ఢిల్లీకి రాగానే నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. ఆత్మీయ ఆలింగనం చేసుకొని సిసలైన భారతీయత ఎలా ఉంటుందో చూపించారు. అంతేకాదు ఆయనతో కలిసి ఒకే కారులో ప్రయాణించారు.. వాస్తవానికి ఇద్దరు దేశాలకు సంబంధించిన అధినేతలు ఒకే కారులో ప్రయాణించడం సాధ్యం కాదు. భద్రత.. ప్రోటోకాల్స్ వంటి కారణాలవల్ల వేరువేరు వాహనాలలో వెళుతుంటారు. కానీ నరేంద్ర మోడీ రూటే వేరు. 2014 నుంచి పుతిన్, ఒబామా, మేక్రాన్, నెతాన్యాహూ వంటి 11 మంది దేశాధినేతలతో కలిసి కార్లలో ప్రయాణించారు. తాజాగా బ్రిక్స్ సదస్సు కోసం వచ్చిన పుతిన్ తో మోడీ కారులో వెళ్లారు. పుతిన్ తో కలిసి ప్రయాణించడం నరేంద్ర మోడీకి ఇది నాలుగోసారి. ఇది వారి స్నేహ బంధానికి బలమైన ప్రతీకగా నిలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper