Homeఅంతర్జాతీయంBRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటీ ప్రయోజనం..

BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటీ ప్రయోజనం..

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి 13 తేదీల వరకు ఈ సదస్సు నిర్వహిస్తారు. ఈసారి సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత మండపంలో నిర్వహిస్తున్నారు. బ్రిక్స్ సదస్సుకు చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో వంటి వారు హాజరు కాబోతున్నారు. చైనా […]

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి 13 తేదీల వరకు ఈ సదస్సు నిర్వహిస్తారు. ఈసారి సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత మండపంలో నిర్వహిస్తున్నారు.

బ్రిక్స్ సదస్సుకు చైనా అధినేత షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో వంటి వారు హాజరు కాబోతున్నారు. చైనా అధ్యక్షుడు దాదాపు ఏడు సంవత్సరాలు తర్వాత భారత దేశంలో అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తత.. వాణిజ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. పశ్చిమసియాలో సంక్షోభం ఉంది. అమెరికా ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తోంది. ఇవన్నీ కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది.

బ్రిక్స్ కూటమిలో 2024 లో ఈజిప్ట్.. ఇరాన్.. ఇథియోపియా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. సౌదీ అరేబియా సభ్య దేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేషియా కూడా ఇందులో చేరింది. బెలారస్.. బొలివియా.. కజకిస్తాన్.. మలేషియా.. క్యూబా.. థాయిలాండ్.. నైజీరియా.. వియత్నాం.. ఉగాండా.. ఉజ్బెకిస్తాన్ వంటివి భాగస్వామ్య దేశాలుగా చేరాయి. ప్రపంచంలో ఉన్న దాదాపు 49.5 జనాభా.. ప్రపంచ జిడిపిలో 40%.. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26 శాతానికి పైగా బ్రిక్స్ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దాదాపు ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న 11 దేశాల ఆర్థిక వ్యవస్థలతో ఈ కూటమి అత్యంత బలంగా ఉంది..

మన దేశం బ్రిక్స్ కూటమిలో వ్యవస్థాపక దేశంగా ఉంది. 2012.. 2016.. 2021 లో కూటమికి నాయకత్వం వహించింది. ఇప్పుడు నాలుగోసారి సారద్య బాధ్యతలను స్వీకరిస్తోంది. బహుపాక్షిక వాదాన్ని బలోపేతం చేయడం.. సమ్మిళితమైన ప్రపంచ పాలన అనే అంశాల ఆధారంగా ఈసారి బ్రిక్స్ సదస్సు మొదలవుతుంది.

భారతదేశానికి ప్రయోజనాలు ఏంటి

  • బ్రిక్స్ సదస్సు ద్వారా భారతదేశానికి న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా నిధులు అందబోతున్నాయి. ఈ నిధుల ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. రోడ్లను.. మెట్రో రైళ్లను.. పర్యావరణహితమైన ప్రాజెక్టులను నిర్మిస్తారు. దీనికోసం రుణాలు కూడా మంజూరు అవుతాయి.సభ్య దేశాల మధ్య పరస్పరం వాణిజ్యం సులభతరం అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతదేశ వస్తువులకు డిమాండ్ ఏర్పడుతుంది..
  • అభివృద్ధి చెందుతున్న దేశాలు.. పేద దేశాల తరఫున అంతర్జాతీయ వేదికల మీద భారతదేశానికి గొంతు వినిపించడానికి ఇది ఒక గొప్ప అవకాశాలు లాగా ఉంటుంది. అమెరికా.. ఐరోపా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడకుండానే.. ప్రపంచ దేశాలలో భారత్ తన ప్రాధాన్యతను పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
  • భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ.. ఈ సమావేశం ద్వారా రెండు దేశాలకు సంబంధించిన నాయకులు నేరుగా మాట్లాడుకుని.. ఉద్రిక్తతలను తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది.
  • అంతర్జాతీయంగా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడి చమురు.. ఇతర రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోవడానికి నివేదిక ఎంతగానో తోడ్పడుతుంది.
  • ఐక్యరాజ్య సమితిలో భద్రతామండలి, వరల్డ్ బ్యాంకు వంటి గ్లోబల్ సంస్థలతో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేదా ఎక్కువ ప్రాతినిధ్యం దక్కే డిమాండ్ ఎప్పటి నుంచే ఉన్నప్పటికీ.. దానికి బ్రిక్స్ దేశాల మద్దతు లభించే అవకాశం ఉంటుంది.
  • కూటమి దేశాల మధ్య పరస్పరం సమాచార మార్పిడి వల్ల ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సైబర్ భద్రతను మరింత పటిష్టం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
  • అంతర్జాతీయంగా వ్యాపారం అమెరికన్ డాలర్ ఆధారంగానే సాగుతూ ఉంటుంది. అయితే అమెరికన్ డాలర్ మీద ఆధారపడే వ్యవహారాన్ని తగ్గించి.. ఇండియన్ కరెన్సీ లేదా ఇతర కరెన్సీలలో చెల్లింపులు జరిపే విధంగా బ్రిక్స్ కూటమి అడుగులు వేసే అవకాశముంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper