Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ కి క్షమాపణలు చెప్పిన త్రిగున్..తర్వాత ఏమైందంటే!

Bigg Boss 10 Telugu: రోహిత్ కి క్షమాపణలు చెప్పిన త్రిగున్..తర్వాత ఏమైందంటే!

Bigg Boss 10 Telugu:  ‘బిగ్ బాస్ 10’ మొదలైనప్పటి నుండి హౌస్ లో రోహిత్, త్రిగున్ మధ్య జరుగుతున్న గొడవలను మనం ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. త్రిగున్ ఉద్దేశపూర్వకంగా రోహిత్ ని టార్గెట్ చేయడం, ఇష్టమొచ్చినట్టు అతని పై నోరు జారడం వంటివి రిపీట్ గా చేస్తూనే ఉన్నాడు. దీంతో రోజురోజుకి త్రిగున్ పై సోషల్ మీడియా నెగెటివిటీ పెరిగిపోతూ వెళ్తోంది. ఇతన్ని ఎలిమినేట్ చెయ్యాలంటూ పెద్ద ఎత్తున క్యాంపైన్స్ ని కూడా నడుపుతున్నారు […]

Bigg Boss 10 Telugu:  ‘బిగ్ బాస్ 10’ మొదలైనప్పటి నుండి హౌస్ లో రోహిత్, త్రిగున్ మధ్య జరుగుతున్న గొడవలను మనం ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. త్రిగున్ ఉద్దేశపూర్వకంగా రోహిత్ ని టార్గెట్ చేయడం, ఇష్టమొచ్చినట్టు అతని పై నోరు జారడం వంటివి రిపీట్ గా చేస్తూనే ఉన్నాడు. దీంతో రోజురోజుకి త్రిగున్ పై సోషల్ మీడియా నెగెటివిటీ పెరిగిపోతూ వెళ్తోంది. ఇతన్ని ఎలిమినేట్ చెయ్యాలంటూ పెద్ద ఎత్తున క్యాంపైన్స్ ని కూడా నడుపుతున్నారు నెటిజెన్స్. అయితే తాను నోరు జారడం పై వీకెండ్ లో నాగార్జున దగ్గర కోటింగ్ వేరే లెవెల్ లో ఉంటుందనే విషయాన్నీ పసిగట్టిన త్రిగున్ , నిన్న స్విమ్మింగ్ పూల్ వద్ద కూర్చున్న రోహిత్ దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి ఎపిసోడ్ లో రోహిత్ ని త్రిగున్ స్టె***డ్స్ బాడీ అని అంటాడు.

ఇది అత్యంత దారుణమైన ఆరోపణ. ఈ అంశంపై త్రిగున్ ని ఒక రేంజ్ లో ఏకిపారేస్తున్నారు నెటిజెన్స్ , రివ్యూయర్స్. ఇదంతా గమనించే నిన్న రోహిత్ కి క్షమాపణలు చెప్పాడు త్రిగున్ . ఆయన రోహిత్ తో మాట్లాడుతూ ‘నిన్న నిన్ను స్టే ***డ్స్ బాడీ అని అన్నందుకు దయచేసి నన్ను క్షమించి. ఆ ఒక్క మాట ని నేను వెనక్కి తీసుకుంటున్నాను, మిగిలిన మాటలపై కట్టుబడి ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే డొల్ల రాజా అని పిలవడం , పిల్లబచ్చగాడివి అని సంబోధించడం, తొక్కలో అగ్నిపరీక్ష అంటూ మాట్లాడడం, వీటి అన్నిటిని సమర్దిమ్చుకుంటున్నాడు అన్నమాట. ఈ అంశాలపై నాగార్జున వైపు నుండి త్రిగున్ కి కోటింగ్ మామూలు రేంజ్ లో ఉండదని టాక్. బిగ్ బాస్ సీజన్ 8 లో అభయ్ కూడా ఇలా నోరు జారాడు. అప్పుడు అతనికి రెడ్ కార్డు చూపిస్తూ బయటకు వచ్చేయ్ అని అంటాడు నాగార్జున.

బిగ్ బాస్ హిస్టరీ లో నాగార్జున అలా రెడ్ కార్డు చూపించడం ఎప్పుడూ గత సీజన్స్ లో జరగలేదు. సీజన్ 8 తర్వాత ఇప్పుడు సీజన్ 10 లో అలాంటి సీన్ రిపీట్ కాబోతుంది. మరి దీని తర్వాత త్రిగున్ మారుతాడా లేదా అనేది చూడాలి. త్రిగున్ కేవలం షో ని మాత్రమే కాదు , వ్యక్తిగత దూషణలు కూడా చాలానే చేసాడు, ఏ విధంగా చూసిన చైత్ర , చరణ్ వంటి వారు ఎలిమినేషన్స్ కి అర్హులు కాదు, త్రిగున్ మాత్రమే అర్హుడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper