Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: కామనర్స్ మధ్య కొట్లాట..రోహిత్ నిజస్వరూపం బయటపడింది!

Bigg Boss 10 Telugu: కామనర్స్ మధ్య కొట్లాట..రోహిత్ నిజస్వరూపం బయటపడింది!

Bigg Boss 10 Telugu:  ‘బిగ్ బాస్ 10’ లో ఊహించని సంఘటనలు ప్రతీ రోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ సీజన్ మొదలై వారం రోజులు కూడా అవ్వలేదు. కానీ నాలుగు వారాల్లో ఎంత కంటెంట్ అయితే వస్తుందో , అంతకు మించిన కంటెంట్ ఈ సీజన్ కి ఆరంభం లోనే వచ్చింది. నాగార్జున గత సీజన్ వీకెండ్స్ లో కేవలం శనివారం మాత్రమే కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకేవాడు, ఆదివారం రోజున ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ […]

Bigg Boss 10 Telugu:  ‘బిగ్ బాస్ 10’ లో ఊహించని సంఘటనలు ప్రతీ రోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ సీజన్ మొదలై వారం రోజులు కూడా అవ్వలేదు. కానీ నాలుగు వారాల్లో ఎంత కంటెంట్ అయితే వస్తుందో , అంతకు మించిన కంటెంట్ ఈ సీజన్ కి ఆరంభం లోనే వచ్చింది. నాగార్జున గత సీజన్ వీకెండ్స్ లో కేవలం శనివారం మాత్రమే కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకేవాడు, ఆదివారం రోజున ఎంటర్టైన్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు రెండు రోజులు కూడా కంటెస్టెంట్స్ కి కోటింగ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఏ రేంజ్ లో కంటెంట్ ఇచ్చారు అని చెప్పడానికి. నిన్నటి ఎపిసోడ్ లో కూడా బోలెడంత కంటెంట్ ఇచ్చారు కంటెస్టెంట్స్. ముఖ్యంగా కామనర్స్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కానీ అవి ఎక్కువ సేపు కొనసాగలేదు.

ముందుగా అమన్, రోహిత్ మధ్య గొడవ జరిగింది. హౌస్ మేట్స్ అవ్వని కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ ‘రన్ రాజా రన్’ అనే టాస్క్ పెడుతాడు. ఈ టాస్క్ లో గెలిచిన కంటెస్టెంట్ కి శాశ్వత ఇంటి సభ్యుడు అయ్యే అవకాశం ఉంటుంది. గెలిచిన హౌస్ మేట్ కి ఒకరిని హై రిస్క్ జోన్ లోకి పంపే పవర్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఆటో రామ్ ప్రసాద్ గెలిచి అమన్ ని హై రిస్క్ జోన్ లోకి పంపుతాడు. ఆటో రామ్ ప్రసాద్ అమన్ పేరు చెప్పగానే రోహిత్ ‘ఎస్.. పర్ఫెక్ట్.. వాడు ఫౌల్ గేమ్ ఆడాడు’ అని అంటాడు. ఆ తర్వాత రోహిత్ రామ్ ప్రసాద్ దగ్గరకు వెళ్లి ‘అమన్ ని ఎందుకు హై రిస్క్ జోన్ లో పెట్టారు, దేబ్ జానీ అసలు ఒక్క రౌండ్ కూడా పూర్తి చెయ్యలేదు , ఆమెని పంపాలి కదా’ అని అంటాడు. అందుకు ఆటో రామ్ ప్రసాద్ ‘నిన్నటి ఎలిమినేషన్ రౌండ్ లో నేను చరణ్ కంటే స్ట్రాంగ్ ప్లేయర్ అయినప్పటికీ , నేను ఎలిమినేట్ అవ్వడానికి ఓటు వేసాడు అమన్, ఇది కూడా అంతే, గేమ్ లో భాగం , అంతకు మించి ఏమి లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ ప్రసాద్.

అయితే రోహిత్ అమన్ ని తీసేసినప్పుడు ‘పర్ఫెక్ట్’ అని అనడాన్ని చైత్ర , వర్షిణి లు అమన్ కి చెప్తారు. అమన్ వెళ్లి రోహిత్ ని నువ్వు నిజంగా ఆ మాట అన్నావా అని అడగ్గా ‘అవును.. అన్నాను.. కానీ నేను షాలిని ని తీయబోతున్నాడు అనే ఉద్దేశ్యం తో అలా అన్నాను. నీ పేరు తీసుకున్నాడు అనే స్పృహ నాకు లేదు. నాకు నువ్వు ఓడిపోవాలని ఉంటే , నేనెందుకు రామ్ ప్రసాద్ దగ్గరకు వెళ్లి నీ గురించి అడుగుతాను’ అని అంటాడు రోహిత్. అలా వీళ్లిద్దరి మధ్య ఈ అంశం పై చాలా సేపటి వరకు గొడవ నడిచింది. ఈ అంశం లో అయితే రోహిత్ తప్పు చేసాడు, అడ్డం గా దొరికిపోయాడు అనే చెప్పాలి. అతనికి షాలిని ని కాకుండా అమన్ ని హై రిస్క్ జోన్ లో పెట్టినందుకు ఎక్కువ ఆనందం ఉంది. ఆ ఆనందం లో వచ్చే మాటే అది. కెమెరాల ఫుటేజీ కోసం , కవర్ చేయడానికి రామ్ ప్రసాద్ వద్దకు వెళ్లి ఎందుకు అమన్ ని హై రిస్క్ జోన్ లో పెట్టారు అని అడిగినట్టు అనిపిస్తోంది. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే రోహిత్ షాలిని మత్తులో రోజురోజుకి మునిగిపోయాడు.

ఇకపోతే శ్రేష్టి , షాలిని మధ్య కూడా గొడవ జరుగుతుంది. ‘రన్ రాజా రన్’ టాస్క్ లో శ్రేష్టి అందరికంటే ముందు షాలిని ని ఎంచుకుంటుంది. దీని పై షాలిని బాగా హర్ట్ అవుతుంది. రోహిత్ కూడా ఈ విషయాన్నీ శ్రేష్టి వద్ద ప్రస్తావిస్తూ , తప్పుబడుతాడు. అవతల టీం స్వతంత్రం గా ఆడినప్పటికీ , వాళ్ళ స్నేహితులను కాపాడుకుంటూ టాస్క్ ఆడారు. కానీ నువ్వు మాత్రం ముందుగా మన ఫ్రెండ్ ని ఎంచుకున్నావు అని రోహిత్ అంటాడు. అలా రోహిత్ , షాలిని చాలా సేపటి వరకు శ్రేష్టి తో గొడవ పెట్టుకుంటారు. శ్రేష్టి చివరికి తన తప్పు ని ఒప్పుకుంది , కావాలని చెయ్యలేదు , ఆ సమయం లో నేను ఇన్ని లాజిక్స్ ఆలోచించలేదు అని చెప్తుంది. అలా అమన్, రోహిత్ , షాలిని , శ్రేష్టి మధ్య గొడవలు జరిగాయి కానీ , అవి ఎక్కువసేపు కొనసాగలేదు , కాసేపటికి అందరూ మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇకపోతే ఎపిసోడ్ చివర్లో మరో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా చైత్ర ని ఎలిమినేట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. పాపం ఇప్పటి వరకు ఆమె ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, ఇద్దరు పిల్లల్ని వదిలేసి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.

అయినప్పటికీ కూడా హౌస్ మేట్స్ ఓట్లతో ఒక ఎలిమినేషన్ చేయడమే తప్పు అనుకుంటే , రెండు ఎలిమినేషన్స్ చేశారు , ఇది చాలా అన్యాయం అని అనిపించింది. అయితే నేటి ఎపిసోడ్ లో అతి పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది, వీళ్లిద్దరికీ ఒక టాస్క్ ని నిర్వహించి , ఎవరో ఒకరిని బిగ్ బాస్ హౌస్ లోకి మళ్లీ పంపుతారు అట. ఇదే నిజమైతే ఈ షో మీద ఏర్పడిన నెగిటివిటీ కాస్త తగ్గుతుంది. లేదంటే ఆ నెగిటివిటీ తారా స్థాయికి చేరుకుంటుంది. రేపు అమన్ , రోహిత్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అవ్వొచ్చు. అప్పుడు సోషల్ మీడియా లో ఈ షో పై నెటిజెన్స్ అసంతృప్తి మామూలు రేంజ్ లో చెయ్యరు అనే చెప్పాలి. చూడాలి మరి ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ టీం మనకి ఇంకెన్ని ట్విస్టులు ఇస్తారు అనేది. నిన్నటి ఎపిసోడ్ లో అమన్ , రోహిత్ లలో తప్పు ఎవరిదీ అనిపించింది?, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper