BRICS summit: చైనా దేశస్తులు సూప్ లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. నూడిల్స్ హాయిగా ఆస్వాదిస్తూ తింటారు. రష్యా దేశస్తులు మాంసాన్ని ఎక్కువగా తింటారు. పిజ్జాలు, బర్గర్లను దంచేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క దేశంలో ప్రజలకు ఒక్కో తీరుగా ఆహారపు అలవాట్లు ఉంటాయి.
ఆ దేశ ప్రజలు ఏమో గాని.. ఆదేశాలను పరిపాలించే నేతలు మాత్రం కచ్చితంగా భారతీయ వంటకాలను తినాల్సిందే. మన కారం ఘాటును.. మసాలా హీటును భరించాల్సిందే. ఇదంతా ఎందుకంటే రేపటి నుంచి మనదేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈసారి ఈ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాట్లను అద్భుతంగా చేశారు.
బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్.. ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్.. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ వంటి వారు హాజరు కాబోతున్నారు. వీరిలో పుట్టింది ఇప్పటికే ఢిల్లీ వచ్చారు. ప్రపంచ దేశాల నుంచి ఆతిరథ మహారధులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేకమైన భారతీయ వంటకాలను పరిచయం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖమైన హోటళ్ల చెఫ్ లు విభిన్నమైన వంటకాలను సిద్ధం చేశారు. జాతీయ మీడియాలో వస్తున్న వార్త ప్రకారం కాశ్మీర్ మసాలా వాల్నట్స్.. గలవుటి కబాబ్.. ఇంకా అనేక రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రఖ్యాతమైన తాజ్ మహల్.. ది లీలా ప్యాలెస్.. ది లలిత్ వంటి హోటళ్లు ఇండియన్ వంటకాలను.. ఆధునిక.. అంతర్జాతీయ స్థాయిలో బండి అతిధులకు వడ్డించబోతున్నాయి.
తాజ్ మహల్ హోటల్లో విఐపి అతిధులకు ట్రెడిషన్ టు టేబుల్ పేరుతో ప్రత్యేకమైన ఆహారపు వంటకాలను సర్వ్ చేయబోతున్నారు. తాజ్మహల్ హోటల్లో పనిచేసే చెఫ్ లు తమ తల్లుల నుంచి నేర్చుకున్న వంటకాలను ఈ మెనులో రూపొందించారు. ఇందులో భాగంగా పురాని ఢిల్లీ మైదా కాజు.. మహారాష్ట్ర బాకర వడి.. రాజస్థాన్ మినీ కచోరి.. బెంగాల్ కూర్చో నిముకి.. తమిళనాడులోని మురుక్కు వంటి వంటకాలు ఇందులో ఉన్నాయి..
ప్రపంచ దేశాల అధినేతల కోసం ఢిల్లీ వ్యాప్తంగా మూడు వేలకు పైగా హోటల్ గదులను బుక్ చేశారు. ఇందులో కొన్ని లగ్జరీ హోటల్స్ లో ఒక్క రాత్రి దాదాపు 2 లక్షల పైగా ఉన్నట్టు సమాచారం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీలోని ఐటిసి మౌర్య హోటల్లో ఉండబోతున్నారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఇక్కడ హోటల్ గదులకు విరితంగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఒక రోజు గది అద్దె దాదాపు 2 లక్షలకు పైగా ఉంది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ తాజ్ ప్యాలెస్ లో ఉంటారు.. బ్రెజిల్.. కజకిస్తాన్.. ఇతర దేశాల అధినేతలు ఒబెరాయ్ హోటల్లో ఉంటారు… బ్రిక్స్ దేశాల ప్రతినిధులు.. ఇతర అధికారులు.. ఐక్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో వంటి వారు మెరీడియన్ హోటల్లో ఉంటారు.. శాంగ్రి హోటల్ లో పశ్చిమ ఆసియా దేశాలకు చెందిన ప్రతినిధులు అందులో బస చేయబోతున్నారు. ఇక్కడ ఒక గది అద్దె దాదాపు 60 వేల వరకు ఉన్నట్టు సమాచారం. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ரஷ்ய அதிபர் புதினுக்கு தெய்வப்புலவர் திருவள்ளுவரின் திருக்குறள் ரஷ்ய மொழிபெயர்ப்பு பிரதியை பரிசளித்தேன். திருக்குறள் தேச எல்லைகள், மொழிகளைக் கடந்த திருவள்ளுவரின் அளப்பரிய ஞானத்தைப் பறைசாற்றுகிறது. pic.twitter.com/7bNWMcMTH7
— Narendra Modi (@narendramodi) September 11, 2026