BRICS summit: అమెరికాకు షాక్.. యూరప్ కంట్రీలకు షాక్. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే మనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దేశం కుళ్ళుకునిచస్తుంది. తట్టుకోలేక గుండెలు బాదుకుంటుంది. ఇదంతా చేసింది నరేంద్ర మోడీ.
ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం వహించారు. ఈ సమావేశానికి చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇంకా చాలామంది హాజరయ్యారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ మీడియా మొత్తం కూడా ఢిల్లీ నగరం మీదనే దృష్టి పెట్టింది. ముఖ్యంగా అమెరికన్ మీడియా.. ఈ సమావేశం మీద నెగిటివ్ వార్తలను ప్రసారం చేయడం మొదలుపెడుతోంది. ఇండియా.. చైనా మధ్య సయోధ్య కుదరదని.. రష్యా అంత ఈజీగా ఇండియాను నమ్మదని ఇంకా అనేక రకాలుగా వెస్ట్రన్ మీడియా వక్రీకరణలకు పాల్పడింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి మొదలు పెడితే.. పాకిస్తాన్ ప్రధాని వరకు నరేంద్ర మోడీ అందరికీ ఏకకాలంలో షాక్ ఇచ్చారు. ఒకే ఒక ఫోటో ద్వారా వాళ్లందరి నోర్లు మూయించారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు తొలి రోజే నరేంద్ర మోడీ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రష్యా, చైనా అధ్యక్షులు పుతిన్, జిన్ పింగ్ చేతులు కలిపి నవ్వులు చిందించారు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ షేర్ చేశారు. ఒక ఫోటో ద్వారా అమెరికా నుంచి మొదలుపెడితే వెస్ట్రన్ దేశాల వరకు గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు నరేంద్ర మోడీ. ఇది సమ్మిట్ మొత్తానికే హైలెట్. కాగా జిన్ పింగ్ నవ్వడం ఇదే తొలిసారి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
డాలర్ పెత్తనానికి చెక్ పెట్టడం.. అన్ని దేశాల కరెన్సీలలో వ్యాపారాలు సాగించడం.. వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం.. ముఖ్యంగా ఎగుమతులు.. దిగుమతుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం వంటి నిర్ణయాలను ఈ సదస్సులో తీసుకోబోతున్నారు. డాలర్ పెత్తనానికి చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. అమెరికా ఈ సదస్సు మీద కుళ్లు కొనిచస్తోంది. అయినప్పటికీ నరేంద్ర మోడీ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా ఈ సదస్సును అత్యంత గొప్పగా నిర్వహిస్తున్నారు. అందువల్లే ఢిల్లీ లో జరుగుతున్న ఈ సదస్సు కు సంబంధించిన వార్తల విషయంలో గ్లోబల్ మీడియా విపరీతమైన ఆసక్తిని చూపిస్తోంది. రెండో రోజు సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
BRICS Summit 2026 gets underway in Delhi. pic.twitter.com/WN7YWi5bTg
— Narendra Modi (@narendramodi) September 12, 2026
Sharing my concluding remarks during the BRICS Summit. pic.twitter.com/PNkEBxAD3O
— Narendra Modi (@narendramodi) September 12, 2026