Samantha Divorce:టాలీవుడ్ మాజీ హీరోయిన్, ప్రస్తుతం బీజేపీ పార్టీ సభ్యురాలు మాధవీలత బాంబు పేల్చారు. సమంత ఎందుకు విడాకులు తీసుకుందో.. దానివెనుక గల కారణాలపై సంచలన నిజాలు చెప్పుకొచ్చారు. సమంతకు మద్దతుగా తాజాగా ఒక వీడియోను ఆమె విడుదల చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది.

నాగచైతన్య-సమంత విడాకులకు అసలు కారణం ఎవరికీ తెలియకపోయినా సోషల్ మీడియాలో నెటిజన్లు దీనికి కారణం అంతా సమంత అంటూ ఆరోపణలు చేస్తున్నాడు. విడిపోవడానికి సమంత వ్యవహారశైలినే కారణమని ఆమెను నిందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మాధవీలత ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సమంతది చాలా మంచి మనసు అని.. ఒక మంచి అమ్మాయి అంటూ చెప్పుకొచ్చింది.
‘‘సమంత ఫౌండేషన్ నడుపుతోంది. దీని ద్వారా చాలా సామాజిక సేవ చేసింది. ఆమె ఫౌండేషన్ కొనసాగించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ఎవరైనా టాలీవుడ్ హీరోలు ఇలా చేశారా?’ అంటూ మాధవీలత ప్రశ్నించారు. అనంతరం సమంత విడాకులపై బాంబు పేల్చింది.
సమంతను ఆమె అత్తామామలు కేవలం ఒక మనీ తీసుకొచ్చే మెషీన్ గా మాత్రమే మార్చారని.. ఆమె 30 ఏళ్ల వయసులో తల్లి కావాలని కోరుకుంది కానీ అత్తామామలు ఆమె కోరికను చంపారని మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది. సమంత సంపాదన అంతా చూసి ఆమెకు పాకెట్ మనీని కూడా కేవలం వేలల్లోనే ఇచ్చారని.. ఆమెకు డబ్బులు ఇవ్వకుండా వేధించారని.. అందుకే సమంత మనసు ముక్కలై విడిపోవాలని నిర్ణయించుకుందని మాధవీలత ఆరోపించింది. విడిపోయి తన సంపాదనతో తను బతకాలని గౌరవంగా నిలబడాలనే విడాకులు తీసుకుందని మాధవీలత సంచలన ఆరోపణలు చేసింది.
సమంత సహా సెలబ్రెటీలు ఎవరైనా సరే తమపై మోపబడే ప్రతీ ఆరోపణలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. కానీ సహోద్యోగులు అదే పరిశ్రమకు చెందిన వ్యక్తుల నుంచి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రతిస్పందించడంలో తప్పు లేదు. ఈ క్రమంలోనే సమంత కు మద్దతుగా తాజాగా మాధవీలత ఈ నిజాలు పంచుకుంది. ఆమెను డబ్బు తెచ్చే ఒక మెషీన్ లా చూశారని.. చేతి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వలేదని.. పిల్లలను కనాలన్న ఆమె ఆశను చిదిమేయడంతో విడాకులు తీసుకొని బయటకు వచ్చిందని మాధవీలత ఆరోపించింది.
అత్తామామ నాగార్జున-అమల వల్లే సమంత విడిపోయిందని మాధవీలత ఆరోపించింది. అయితే సమంత ఇటీవలే నాగార్జునను ‘గొప్ప వ్యక్తి’ అంటూ ప్రేమగా ‘మామ’ అని కూడా పిలిచింది. దీంతో నాగార్జుననే కారణమన్న మాధవీలత ఆరోపణను ఎలా సమర్థించాలన్నది ఇక్కడ అందరికీ అర్థ: కానీ ప్రశ్న. లైమ్ లైట్ లో ఉండడానికి మాధవీలత ఈ ఆరోపణలు చేసిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సమంత మాత్రం ఇప్పటికీ వారి కుటుంబానికి రుణపడి ఉంటోంది. అక్కినేని ఫ్యామిలీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. దీంతో మాధవీలత విమర్శలపై డౌట్లు మొదలవుతున్నాయి.
-మాధవీలత సంచలన వీడియో
https://www.youtube.com/watch?v=fo0mxBptrvc