Homeఎంటర్టైన్మెంట్Samantha Ruth Prabhu : గర్భం తోనే టీవీ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్న...

Samantha Ruth Prabhu : గర్భం తోనే టీవీ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్న సమంత.. పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు..

Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత , సమంత సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆమె గర్భం దాల్చింది. ‘మెటర్నిటీ లీవ్’ ని తీసుకుంటుందని అనుకున్నారు. ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ లో కూడా ఇదే చెప్పింది. కానీ సమంత గర్భిణీ స్త్రీ లాగా అసలు వ్యవహరించడం లేదు. తన డైలీ వర్కౌట్స్ ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఒకపక్క ‘బేబీ బంప్’ […]

Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత , సమంత సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇస్తుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆమె గర్భం దాల్చింది. ‘మెటర్నిటీ లీవ్’ ని తీసుకుంటుందని అనుకున్నారు. ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ లో కూడా ఇదే చెప్పింది. కానీ సమంత గర్భిణీ స్త్రీ లాగా అసలు వ్యవహరించడం లేదు. తన డైలీ వర్కౌట్స్ ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఒకపక్క ‘బేబీ బంప్’ కళ్ళకు కనిపిస్తోంది. ఇలాంటి సమయం లో వర్కౌట్స్ అవసరమా అని అభిమానులు అంటుంటారు. కానీ సమంత రూటే సపరేటు. ఆమె విల్లింగ్ పవర్ తో ఎలాంటి సవాళ్ళను అయినా ఎదురుకుంటుంది. అయితే సమంత ఇప్పుడు మరో ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకుంది. తమిళం లో ఓకే ఓటీటీ షో చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

రీసెంట్ గానే ఈ షో కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. సోనీ పిక్చర్స్ సంస్థ కాసేపటి క్రితమే సమంత ‘మాస్టర్ చెఫ్’ అనే తమిళ ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. ఈ కుకింగ్ షో సోనీ విజ్ తో పాటు సోనీ లివ్ వేదికల్లో ప్రసారం కానుంది. ఈ షో లో సినీ రంగానికి చెందిన ప్రముఖులు కంటెస్టెంట్స్ గా వ్యవహరించనున్నారు. సరిగ్గా మన మా టీవీ ఛానల్ లో ప్రసారమైన ‘కుకూ విత్ జాతి రత్నాలు’ తరహా షో లాగా అన్నమాట ఇది. అయితే ఈ షో లో టాప్ నటీనటులు ఉంటారు. ఈ షో గురించి సమంత మాట్లాడుతూ ”సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం’ షో ఇంతకుముందు నేను చేసిన వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ షో తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే నన్ను సంప్రదించిన వెంటనే కాదని చెప్పలేకపోయాను’.

‘జనాలకు రకరకాల ఫుడ్ రెసిపీలను చూపించడమే కాకుండా, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఈ షో అందించనుంది. అంతేకాకుండా కెమెరాలకు కనిపించని మనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే షో ఇది. మీ అందరికీ బాగా ఇష్టమైన సినీ సెలబ్రిటీలు ఈ షో లో పాల్గొనబోతున్నారు. వాళ్ళ మధ్య జరిగే పోటీలు వీక్షించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఎక్కువ ఒత్తిడి లేకుండా , చాలా సింపుల్ గా సాగిపోయే విధంగా ఈ షో ఉంటుంది కాబట్టే , సమంత చేయడానికి ఒప్పుకుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper