spot_img
Homeట్రెండింగ్ న్యూస్రైల్వేస్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

రైల్వేస్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

Open Railway Canteens And Shops

దేశంలోని యువతలో కొంతమంది ఉద్యోగం ద్వారా డబ్బులు సంపాదించాలని భావిస్తుంటే మరి కొంతమంది మాత్రం వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుత కాలంలో వ్యాపారం చేయాలన్నా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే వ్యాపారం చేయాలని అనుకునే వాళ్లు రైల్వేస్ తో కలిసి వ్యాపారం చేస్తే సులభంగా డబ్బులను పొందే అవకాశం ఉంటుంది.

Also Read: కొత్తరకం కరోనా గురించి షాకింగ్ న్యూస్.. ఏ వ్యాక్సిన్ పని చేయదట..?

ఇండియన్ రైల్వేస్ తాజాగా గూడ్స్ షెడ్ డెవలప్‌మెంట్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. రైల్వే శాఖ గూడ్స్ షెడ్ డెవలప్‌మెంట్ పాలసీ ద్వారా ప్రైవేట్ భాగస్వాములతో కలిసి దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లకు దగ్గరలో దుకాణాలను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. రైల్వే శాఖకు దగ్గరలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా కస్టమర్లు క్యాంటీన్ లేదా టీ షాప్ పెట్టి నెలకు వేల రూపాయల ఆదాయం పొందవచ్చు.

Also Read: ‘భారత్’లో విజృంభిస్తున్న మరో వ్యాధి.. 12వేల బాతులు మృతి..?

రైల్వేస్ తో కలిసి పని చేయడం వల్ల తక్కువ సమయంలోనే కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గూడ్స్ షెడ్ డెవలప్‌మెంట్ పాలసీ ద్వారా ఇప్పటికే రైల్వే స్టేషన్లలో షాపులు ఉన్నవాళ్లు ఆ షాపులను మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. క్యాంటీన్, టీ షాప్ కాకుండా ఇతర బిజినెస్ లు చేయడం ద్వారా కూడా లాభాలను పొందవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: వైరల్ వార్తలు

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశం ఉన్నవాళ్లు ఈ పాలసీలో చేరి బిజినెస్ ను ప్రారంభించి గూడ్స్ షెడ్ డెవలప్‌మెంట్ పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు. మరోవైపు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ మరియు యాప్ లలో కీలక మార్పులు చేసింది. ఈ మార్పుల వల్ల కస్టమర్లకు మరింత సులభంగా టికెట్ బుకింగ్ చేసే అవకాశం ఉండటంతో పాటు ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper