Homeజాతీయ వార్తలుIRCTC: రైలు టికెట్స్ ఇక చిటికెలో దొరుకుతాయి.. కంగారు పడాల్సిన పనిలేదు.. ఇలా చేయండి..

IRCTC: రైలు టికెట్స్ ఇక చిటికెలో దొరుకుతాయి.. కంగారు పడాల్సిన పనిలేదు.. ఇలా చేయండి..

IRCTC: భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ డిమాండ్‌కు అనుగుణంగా ఇండియన్ రైల్వేస్ తన IRCTC వెబ్‌సైట్ తో పాటు రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరిస్తోంది. కొత్త అప్‌గ్రేడ్‌లతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన, అంతరాయం లేని టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతోంది. ఇందులో భాగంగా తాగాజా కీలక మార్పులు చేసింది. ఈ మార్పుతు టికెట్ బుకింగ్ మరింత సులభంగా మారనుంది. అదేంటొంటే? […]

IRCTC: భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ డిమాండ్‌కు అనుగుణంగా ఇండియన్ రైల్వేస్ తన IRCTC వెబ్‌సైట్ తో పాటు రిజర్వేషన్ వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరిస్తోంది. కొత్త అప్‌గ్రేడ్‌లతో ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన, అంతరాయం లేని టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతోంది. ఇందులో భాగంగా తాగాజా కీలక మార్పులు చేసింది. ఈ మార్పుతు టికెట్ బుకింగ్ మరింత సులభంగా మారనుంది. అదేంటొంటే?

ప్రస్తుతం అధిక రద్దీ సమయంలో.. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే వెబ్‌సైట్ స్లో అవడం లేదా సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో IRCTC రిజర్వేషన్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తోంది. అప్‌గ్రేడ్ అనంతరం నిమిషానికి సుమారు 1.5 లక్షల టికెట్లు బుక్ చేసే సామర్థ్యం వ్యవస్థకు లభిస్తుంది. దీంతో ఒకేసారి లక్షల మంది ప్రయాణికులు లాగిన్ అయినా సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.

వెబ్‌సైట్ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చనున్నారు. వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) ను తీసుకురానున్నారు. అవసరమైన సమాచారం తక్కువ క్లిక్‌లలోనే అందుబాటులోకి వచ్చేలా డిజైన్ రూపొందిస్తున్నారు. మొబైల్, కంప్యూటర్ రెండింటిలోనూ వేగంగా పనిచేసేలా పేజీలను ఆప్టిమైజ్ చేస్తున్నారు. కొత్త వ్యవస్థలో పేజీలు గతంతో పోలిస్తే మరింత వేగంగా లోడ్ అవుతాయి. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో ప్రతి సెకన్ విలువైనదిగా ఉండటంతో, వేగవంతమైన పేజీ లోడింగ్ ప్రయాణికులకు పెద్ద ఊరటగా మారనుంది. సర్వర్ స్పందన సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించేందుకు సాంకేతిక మార్పులు చేస్తున్నారు.

ప్రయాణికుల సౌకర్యం కోసం పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. సీట్ సెలెక్షన్ ద్వారా అందుబాటులో ఉన్న సీట్లను సులభంగా చూసి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫేర్ క్యాలెండర్ ద్వారా వేర్వేరు తేదీల్లో టికెట్ ధరలను ముందుగానే పోల్చి, తక్కువ చార్జీ ఉన్న రోజును ఎంచుకునే వెసులుబాటు లభిస్తుంది. దీంతో ప్రయాణ ప్రణాళిక మరింత సులభమవుతుంది.

టికెట్ బుకింగ్ సమయంలో ఎక్కువ సమయం తీసుకునే అనవసర క్యాప్చాలు, పాప్-అప్‌లు తొలగించనున్నారు. దీంతో బుకింగ్ ప్రక్రియలో ఆలస్యం తగ్గి, తక్కువ సమయంలోనే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైన భద్రతా ప్రమాణాలను కొనసాగిస్తూనే వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేలా ఈ మార్పులు చేస్తున్నారు.

వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చే ఈ కొత్త సదుపాయాలను RailOne యాప్లో కూడా అందించనున్నారు. టికెట్ బుకింగ్, రిజర్వేషన్ వివరాలు, సీట్ ఎంపిక, చార్జీల సమాచారం వంటి అన్ని సేవలను ఒకే యాప్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులు ప్రత్యేకంగా వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper