Homeఆంధ్రప్రదేశ్‌Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. చంద్రబాబు ప్లాన్ కు విజయ్ జై...

Godavari Cauvery River Linking: గోదావరి, కావేరి కలిసిపోతున్నాయి.. చంద్రబాబు ప్లాన్ కు విజయ్ జై కొట్టాల్సిందే..

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి. ఈ నదుల ప్రవాహం ఆధారంగానే ఆయా ప్రాంతాలలో మనుషుల జీవనం. పంటల సాగు ఆధారపడి ఉంటాయి. దక్షిణ భారత దేశంలో ఈ రెండు నదుల ప్రవాహం ఆధారంగానే లక్షల మంది ప్రజలు.. అదే స్థాయిలో పంటలు సాగుతూ ఉంటాయి. అనేక సందర్భాలలో చర్చలు ఈ రెండు నదులు జీవ నదులు.. వీటి అనుసంధానం మీద గతంలో అనేక సందర్భాలలో […]

Godavari Cauvery River Linking: మన దేశంలో విస్తారంగా ప్రవహించే నదులలో గోదావరి, కావేరి ముందు వరుసలో ఉంటాయి. ఈ నదుల ప్రవాహం ఆధారంగానే ఆయా ప్రాంతాలలో మనుషుల జీవనం. పంటల సాగు ఆధారపడి ఉంటాయి. దక్షిణ భారత దేశంలో ఈ రెండు నదుల ప్రవాహం ఆధారంగానే లక్షల మంది ప్రజలు.. అదే స్థాయిలో పంటలు సాగుతూ ఉంటాయి.

అనేక సందర్భాలలో చర్చలు

ఈ రెండు నదులు జీవ నదులు.. వీటి అనుసంధానం మీద గతంలో అనేక సందర్భాలలో చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు ఆచరణ దిశగా అడుగులు పడతాయని తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయ్ వస్తున్నారు. దసరా ఉత్సవాలకు ఆయనను ఇటీవల చంద్రబాబు ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి విజయ్ ఏపీకి వస్తున్నారు. కేవలం ఇది ఉత్సవాలకు హాజరయ్యే కార్యక్రమం మాత్రమే కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. విజయ్ మధ్య గోదావరి, కావేరి నదుల అనుసంధానానికి సంబంధించిన ఉన్నత స్థాయి భేటీ జరగబోతోంది. ఇప్పటికే నరేంద్ర మోడీకి ప్రత్యేకమైన ఎస్ పి వి ద్వారా గోదావరి.. కావేరి నదుల అనుసంధానాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి విజయ్ కోరారు.

దక్షిణాది ప్రాంతం మారుతుంది

కావేరి.. గోదావరి నదులు కలిసిపోతే దక్షిణాది ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి. వర్షాకాలం సమయంలో గోదావరి నదిలో దాదాపు 3 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణ పరిధిలో తీవ్రమైన నీటి కొరత ఉంది. కావేరి డెల్టా పరిధిలో తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిపిఆర్ రూపొందించింది. దీని ప్రకారం గోదావరిలో ఉండే 247 టీఎంసీల మిగులు జలాలను కృష్ణ.. పెన్నా నదుల మీదుగా కావేరి వరకు తీసుకెళ్లొచ్చు. సముద్రంలోకి వెళ్లే నీటిని మళ్లించడం ద్వారా.. రాష్ట్రాల అవసరాలు తీర్చవచ్చు.

మూడు రాష్ట్రాలకు కీలకం..

రెండు నదుల అనుసంధానం పూర్తయితే ఏపీ.. తెలంగాణ.. తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనాలు విపరీతంగా లభిస్తాయి. కృష్ణ డెల్టా పరిధిలో వ్యవసాయం స్థిరీకరణ గురవుతుంది. గోదావరి నీరు వస్తే శ్రీశైలం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే కృష్ణ నీటిని రాయలసీమలోని ప్రాజెక్టులకు.. తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలకు పూర్తిస్థాయిలో నీటిని తరలించవచ్చు. నెల్లూరు.. ప్రకాశం లోని వ్యవసాయ భూములకు నీటిని అందించవచ్చు. చెన్నై నగరానికి తాగునీటి సమస్యను దూరం చేయవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కావేరి డెల్టకు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చు. తద్వారా రాష్ట్రాల మధ్య జరుగుతున్న గొడవలను తగ్గించవచ్చు. కావేరి, గోదావరి అనుసంధానం ద్వారా 9.38 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది.

గోదావరి, కావేరి ఒక ఇంజనీరింగ్ అద్భుతం

చంద్రబాబు.. విజయ్ మధ్య కనిపిస్తున్న సమన్వయం ఈ ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లో టిడిపి కీలకమైన భాగస్వామిగా ఉంది. ఈ ప్రాజెక్టుకు జాతీయస్థాయి హోదా కల్పించడానికి.. 90 శాతం నిధులను కేంద్రం భరించే విధంగా చంద్రబాబు చొరవ తీసుకుంటే ఈ ప్రాజెక్టు విషయంలో కీలక అడుగులు పడతాయి. తమిళనాడు రాష్ట్రం తరఫున విజయ్.. ఈపీ తరఫున చంద్రబాబు ఓకే అభిప్రాయంతో కేంద్రం ముందు ఒక బలమైన ప్రతిపాదన కనుక ఉంచితే.. కావేరి.. గోదావరి అనుసంధానానికి సంబంధించిన కార్యాచరణ మొదలవుతుంది. చంద్రబాబుకు సాగునీటి పారుదల రంగంలో విపరీతమైన అనుభవం ఉంది. విజయ్ కి సంకల్పబలం ఉంది. వీరిద్దరూ కలిస్తే గోదావరి, కావేరి ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా మిగిలిపోతుంది. మూడు రాష్ట్రాల తాగు, సాగు నీటి సమస్యలు తీరిపోతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper