Chandrababu Naidu: నేను కొడితే ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ.. ఏదోలా ఉంటుందని చాలా మంది చెబుతుంటారు.. అందుకే నా చేతిలో దెబ్బలు తినకండి.. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా.. ఇప్పుడు ఆ డైలాగు మాదిరిగానే వ్యవహరిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వన్స్ ఐస్ స్టెప్ ఇన్.. ఏపీ పాలిటిక్స్ విల్ ఫాలోస్ మీ అన్నట్టుగా ఆయన ఇప్పుడు అక్కడి రాజకీయాలలో తన చక్రం తిప్పుతున్నారు.
ఒకప్పుడు చంద్రబాబును హేళన చేశారు. నిండు శాసనసభ సాక్షిగా ఇబ్బంది పెట్టారు.. చివరికి ఆయన కంటతడి పెట్టేదాకా వదిలిపెట్టలేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు రివేంజ్ పాలిటిక్స్ చేయడం లేదు. కాకపోతే జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. రాజకీయాలు అంటే ఎలా చేయాలో చూపిస్తున్నారు. తద్వారా జగన్ ఊహకు కూడా అందకుండా చంద్రబాబు దూసుకుపోతున్నారు. ఇటీవల ప్రతి సందర్భంలోనూ 2014 చంద్రబాబు కాదు.. 1995 చంద్రబాబు అంటూ పదే పదే చెబుతున్నారు. దీనిని బట్టి చంద్రబాబు రాజకీయాలలో ఎంతటి స్పీడ్ అప్ విధానాన్ని అవలంబిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల సూత్రాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు తట్టెడు మట్టి తీసింది లేదు. తాపీతో కాంక్రీట్ వేసింది లేదు. విశాఖపట్నంలో ఋషికొండ చుట్టూ అతిపెద్ద భవనాలు నిర్మించుకున్నారు. అవి ఎందుకు నిర్మించుకున్నారు.. దేనికోసం నిర్మించుకున్నారు.. వాటి వల్ల ప్రయోజనం ఏంటి అనేది ఇప్పటికి తెలియదు. కాకపోతే ప్రజాధనానికి మాత్రం వందల కోట్లు బొక్క పడింది.
ఇక ఇప్పుడు జగన్ విధ్వంస పరిపాలనకు చరమగీతం పాడిన చంద్రబాబు.. అభివృద్ధి కోణంలో సరికొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి గుండె కాయ లాంటి విజయవాడ నగరానికి పర్యాటక శోభను మరింత తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. మైసూర్ తరహాలోనే దసరా వేడుకలను జరిపేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు (కేరళ మినహా) అందరినీ ఆహ్వానించారు. దసరా ఉత్సవాలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా రాబోతున్నారు. విజయ్ రావడం ఇప్పుడు జగన్ లో ఆందోళన కలిగిస్తోంది.
జగన్ కు అత్యంత సన్నిహితులైన అనిల్ రెడ్డి.. ఇంకా కొంతమంది విజయ్ ప్రభుత్వంలో ఉన్నారు. పైగా జగన్ మావిగన్ అనే ప్రతిపాదనను ఇటీవల తీసుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల విషయాన్ని పక్కన పెట్టారు. కానీ చంద్రబాబు మాత్రం.. జగన్ కు అత్యంత దగ్గరైన వ్యక్తులని ఏపీకి ఆహ్వానిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులను.. రాజధాని వ్యవహారాలను.. దగ్గరుండి చూపించబోతున్నారు. తద్వారా జగన్ ఎటువంటి మోసగాడు.. ఎలాంటి కుట్రలకు పాల్పడ్డాడు.. రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు అనే విషయాలను పరోక్షంగా చూపించబోతున్నారు. ఇప్పటిదాకా జగన్ తనను తాను సంక్షేమ సారధిగా.. అభివృద్ధి కామకుడిగా ప్రచారం చేసుకున్నారు. కానీ అదంతా డొల్ల అని.. చూపించబోతున్నారు చంద్రబాబు. పైగా జగన్ కు దగ్గరగా ఉన్న వ్యక్తులకే అతడు రియాల్టీ చూపిస్తూ ఉండడం రాజకీయాలలో కొత్త పరిణామం. జగన్ అనుచరులు ఎంతగా వారించినప్పటికీ విజయ్ ఏపీకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నిబట్టి చంద్రబాబు వేసిన పాచికలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు. రాజకీయాలు అందరూ చేస్తారు. కానీ మైండ్ గేమ్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నెంబర్ వన్. ఎందుకంటే గొడ్డలి పోట్లకు.. మెదడుతో చేసే ఆలోచనకు చాలా తేడా ఉంటుంది.