Vijay Thalapathy: రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఎంతటి నాయకుడైనా సరే అధికారం కోసం ఏమైనా చేస్తాడు. ఎంత దాకా అయినా పరుగులు పెడతాడు. అవసరమైతే నాలుగు మెట్లు దిగివస్తాడు. లేకపోతే నాలుగు మెట్లు ఎక్కి మీసాలు మేలేస్తాడు. ఎందుకంటే అధికారం అనేది వజ్రాయుధం లాంటిది. ఏమైనా చేయవచ్చు. ఏందాకైనా దూసుకుపోవచ్చు.
మీరు మన దేశ రాజకీయాలను ఒకసారి పరిశీలిస్తే అధికారాన్ని కాదనుకునే ఏ నాయకుడు ఉండరు. అధికారం కోసమే అన్ని పార్టీలు నేల విడిచి సాము చేస్తూ ఉంటాయ్. అవసరమైతే పోతులు పెట్టుకుంటాయి. లేకపోతే పొత్తులను వద్దనుకుంటాయి. అధికారం లెక్కలలో.. కుర్చీని కాపాడుకోవాలి అనే తాపత్రయంలో రకరకాల వ్యవహారాలకు రాజకీయ పార్టీలు పాల్పడుతుంటాయి. అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఆ తానులో ముక్కలే.
రాజకీయ పార్టీలను నడిపించేది నాయకులే కాబట్టి.. వారి అడుగులకు తగ్గట్టుగానే రాజకీయ పార్టీల వ్యవహారాలు సాగిపోతూ ఉంటాయి. మనదేశంలో కాకలు తీరిన రాజకీయ నాయకులు చిత్ర విచిత్రమైన పాలిటిక్స్ చేశారు. ఈ తరహా పాలిటిక్స్ నిర్వహించడంలో సినీ నటులు పెద్దగా విజయవంతం కాలేదని చెప్పాలి. కాకపోతే ఇప్పుడు ఆ లోటును విజయ్ భర్తీ చేస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలిచింది. కాకపోతే అధికారానికి దూరంగా నిలిచింది. ఈ సమయంలో రాహుల్ గాంధీ సపోర్ట్ తీసుకుని తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు విజయ్. ఆ తర్వాత తన స్టైల్ పరిపాలనలో చూపిస్తున్నారు. ఒకరకంగా ద్రావిడ వాదాన్ని విజయ్ పక్కన పెట్టి తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా చెన్నైలో మెట్రో పనులకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపనకు వస్తే.. సాదరంగా ఆహ్వానించారు. అంతేకాదు ఆయనతో కలిసి మాట్లాడారు. తమిళనాడు ఆతిథ్యాన్ని ప్రధానమంత్రి కి అందించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆయనతో లంచ్ కూడా చేశారు.
కేంద్రంలో కీలక శక్తిగా ఉన్న నరేంద్ర మోడీని.. ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్న వ్యక్తిని రోజు వ్యవధిలో కలిసి విజయ్ సంచలనం సృష్టించారు. ఇక్కడ ఆయన తమిళనాడు అభివృద్ధిలో రాజీ పడలేదు. రాజకీయాలలో కూడా వెనకడుగు వేయలేదు. జస్ట్ ఆయన పార్టీ స్థాపించి కొద్ది రోజులు మాత్రమే. ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి కాకలు తీరిన నాయకులకు కూడా సాధ్యం కానీ రాజకీయాలు చేస్తూ అదరగొడుతున్నారు. విజయ్ వ్యవహరించిన తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా చర్చకు దారి తీస్తోంది. వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో గానీ.. ఇప్పుడైతే విజయ్ అన్ స్టాపబుల్ మాదిరిగా దూసుకుపోతున్నారు. ఇటీవల జరిగిన బైపోల్స్ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచినప్పటికీ.. అంచనా వేసిన విధంగా మెజారిటీ రాకపోయినప్పటికీ.. విజయ్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.