Homeటాప్ స్టోరీస్Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కే చెమటలు పట్టాయి. ఈ ప్రశ్నకు బదులేదీ.. వైరల్ వీడియో

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కే చెమటలు పట్టాయి. ఈ ప్రశ్నకు బదులేదీ.. వైరల్ వీడియో

Hydra Ranganath: కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా వ్యవహారం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. రంగనాథ్ ను హైడ్రా అధిపతి స్థానం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో హైడ్రా గురించి రచ్చ రచ్చ జరుగుతుంది. హైడ్రా అధినేత రంగనాధ్ ఇటీవల ఒక యూట్యూబర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాస్తవానికి రంగనాథ్ హైడ్రా అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ పాపులారిటీ […]

Hydra Ranganath: కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా వ్యవహారం తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. రంగనాథ్ ను హైడ్రా అధిపతి స్థానం నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో హైడ్రా గురించి రచ్చ రచ్చ జరుగుతుంది.

హైడ్రా అధినేత రంగనాధ్ ఇటీవల ఒక యూట్యూబర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాస్తవానికి రంగనాథ్ హైడ్రా అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన ఎస్పీగా.. ఐజిగా సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ.. రాని గుర్తింపు హైడ్రా అధిపతిగా వచ్చింది.

హైడ్రా అధిపతిగా రంగనాథ్ అనేక రకాల సంస్కరణలకు బీజం వేశారు. హైదరాబాదులో దాదాపు అక్రమాలను ఉక్కు పాదంతో తొక్కి వేశారు. చెరువులను పునరుద్ధరించే పనిలోపడ్డారు. ఒక నివేదిక ప్రకారం దాదాపు మూడు వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను ఆయన కాపాడారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ లక్ష కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

మంచి వెనుక చెడు ఉన్నట్టు.. హైడ్రా అధినేత చేస్తున్న పనులు కొన్ని గొప్పగా ఉంటే.. మరికొన్ని విమర్శలకు దారితీసాయి. ఇవే అంశాలను ఆ యూట్యూబర్ ప్రశ్నించారు. దీనికి రంగనాథ్ ఓపెన్ గానే సమాధానం చెప్పారు. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను పడగొట్టిన మీరు.. కొన్నింటి విషయంలో ఎందుకు ముందు అడుగు వెయ్యలేదని ఆ యూట్యూబర్ ప్రశ్నించారు. దానికి రంగనాధ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నీళ్లు తాగారు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శాసనసభ కూడా ఎఫ్డిఎల్ పరిధిలోనే ఉందని.. అలాంటప్పుడు దాన్ని కూడా కులగోడతారా అని ఆ యూట్యూబర్ ప్రశ్నించారు. దానికి రంగనాథ్ స్పష్టంగా సమాధానం చెప్పలేదు. అలా కూల్చడానికి అవకాశం లేదని పేర్కొన్నారు.

మరోవైపు భూములను అమ్మిన వ్యక్తులు బాగానే ఉన్నారు. కొనుగోలు చేసిన వ్యక్తులు గృహాలు కట్టుకుంటే.. వాటిని హైడ్రా కూల్చివేసింది. వాటి విషయంలో మీరేం చేశారని ఆ యూట్యూబర్ ప్రశ్నిస్తే.. అటువంటి వ్యక్తుల మీద కేసులు వేశామని హైడ్రా అధినేత చెప్పారు. అంతేకాదు వారి మీద విచారణ కూడా జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు కేవలం గృహాలను నిర్మించుకున్న వారి జోలికి మాత్రమే హైడ్రా వెళ్లిందని ఆరోపణలు నేపథ్యంలో.. వాటికి రంగనాథ్ మొత్తానికి ఇన్ని రోజులకు క్లారిటీ ఇచ్చారు.

ఇక సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో కూడా రంగనాథ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 2014లో సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారని.. ఆ తర్వాత దానిమీద హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని.. స్టే ద్వారానే 10 సంవత్సరాలపాటు వ్యాపారం కొనసాగించారని.. హైడ్రా వచ్చిన తర్వాత ఎన్ కన్వెన్షన్ సెంటర్ పడగొట్టామని రంగనాథ్ పేర్కొన్నారు. మరోవైపు జలవనరులు.. నాలాల వంటి వాటి పరిరక్షణలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని.. అలాంటప్పుడు ఎవరికి తాము నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని రంగనాథ్ పేర్కొన్నారు.

మొత్తానికి తన మీద వస్తున్న ఆరోపణలకు రంగనాథ్ అనేక విధాలుగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆక్రమణల తొలగింపు విషయంలో రకరకాల ఒత్తిడిలు వచ్చినప్పటికీ తాను ధైర్యంగానే ముందుకు సాగినట్టు వివరించారు.

 

View this post on Instagram

 

A post shared by VAMSHI KURAPATI (@thevamshikurapati)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper