HYDRA Ranganath : ఇది మామూలు మోసం కాదు. వాళ్లు మామూలు వ్యక్తులు కాదు. చేసిన పన్నాగం అంతకుమించిన స్థాయిలో ఉంది. వాళ్ళు ఏకంగా హైడ్రా రంగనాథ్ కే టోపీ పెట్టారు. హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు లేకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసింది.. దీని ద్వారా చెరువులను.. కుంటలను.. నాలాలాను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా వ్యవస్థ అత్యంత దూకుడుగా పని చేస్తోంది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ఆక్రమణల విషయంలో ఉక్కు పాదం మోపుతున్నారు. ఏ మాత్రం దాన్ని కడుగు వేయకుండా ఆక్రమణలను పడగొడుతున్నారు. చెరువులను కాపాడుతున్నారు. ప్రకృతి వనరులను సంరక్షిస్తున్నారు.
హైడ్రా రంగనాథ్ చేస్తున్న మంచి పనులను కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అక్రమార్కులు కోర్టులలో పిటిషన్లు దాఖలు చేసి.. ఆయన కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అక్రమార్కుల వ్యవహార శైలి ఇలా ఉంటే.. కార్పొరేట్ కాలేజీ నిర్వాహకుల తీరు మరో విధంగా ఉంది. వీరు ఏకంగా ఫైర్ ఎన్ఓసిపై రంగనాథ్ కే టోపీ పెట్టారు. సంతకాలు ఫోర్జరీ చేశారు. ఏకంగా ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేశారు. అధికారులు సంతకం ఫోర్జరీ జరిగిందని విచారణలో గుర్తించారు. ఆ ఎనిమిది కాలేజీలకు సంబంధించిన గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఇప్పటికే ఫిర్యాదు అందింది. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ 8 కాలేజీ ల మీద లేక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బర్కత్పురా ప్రాంతానికి చెందిన హైందవి జూనియర్ కాలేజీ.. ఎస్ ఆర్ నగర్ కు చెందిన రేసోనన్స్ జూనియర్ కాలేజీ.. మెహదీపట్నం కి చెందిన ప్రియాంక జూనియర్ కాలేజీ.. విద్యానగర్ ప్రాంతానికి చెందిన మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ.. చాంద్రాయణ గుట్ట ప్రాంతానికి చెందిన శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ.. చిక్కడపల్లికి చెందిన న్యూ ఎరా కాలేజీ.. శివరాంపల్లికి చెందిన షాహీన్ జూనియర్ కాలేజీ.. తెల్లాపూర్ ప్రాంతానికి చెందిన వశిష్ట జూనియర్ కాలేజీ నిర్వాహకుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా 60 కాలేజీల ఎన్ఓసి లను కూడా స్క్రూట్ ని చేస్తున్నట్టు పోలీసు అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో ఫైర్ ఎన్ఓసి జారీ చేసే విషయంలో హైడ్రా అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. అన్ని నిబంధనలు పాటించిన కాలేజీలకు మాత్రమే ఎన్వోసీ ఇస్తోంది. కాలేజీ గుర్తింపు రద్దు అవుతుంది. అందువల్లే కాలేజీ యాజమాన్యాలు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాయి. హైడ్రా రంగనాథ్ కు ఏకంగా టోపీ పెట్టిన ఈ కాలేజీ యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కాలేజీ యాజమాన్యాల మీద ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తున్నారు.

