Homeఆంధ్రప్రదేశ్‌TV9 Pratyusha: ఎథిక్స్ కంటే టీఆర్పీనే ముఖ్యం.. భర్త కంటే ఆమె ఎక్కువ.. టీవీ9 యాంకర్...

TV9 Pratyusha: ఎథిక్స్ కంటే టీఆర్పీనే ముఖ్యం.. భర్త కంటే ఆమె ఎక్కువ.. టీవీ9 యాంకర్ ప్రత్యూష సంచలనం

TV9 Pratyusha: టీవీ9 ఛానల్ లో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న అనుభవం యాంకర్ ప్రత్యూషకు ఉంది. ఈమె వాగ్దాటి.. వార్తలు చెప్పే తీరు బాగుంటుంది. అందువల్లే ప్రత్యూష దాదాపు రెండు దశాబ్దాలుగా టీవీ9 లో కొనసాగుతోంది. గతంలో ఎన్నడు కూడా ఈమె తన వ్యక్తిగత విషయాలను పంచుకోలేదు. అప్పట్లో హిమజ చేసిన హోం టూర్ లో తన ఇంటి గురించి .. అభిరుచుల గురించి చెప్పింది. తన వ్యక్తిగత విషయాలను.. వృత్తి గత విషయాలను ఎన్నడు పంచుకోలేదు. […]

TV9 Pratyusha: టీవీ9 ఛానల్ లో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న అనుభవం యాంకర్ ప్రత్యూషకు ఉంది. ఈమె వాగ్దాటి.. వార్తలు చెప్పే తీరు బాగుంటుంది. అందువల్లే ప్రత్యూష దాదాపు రెండు దశాబ్దాలుగా టీవీ9 లో కొనసాగుతోంది. గతంలో ఎన్నడు కూడా ఈమె తన వ్యక్తిగత విషయాలను పంచుకోలేదు. అప్పట్లో హిమజ చేసిన హోం టూర్ లో తన ఇంటి గురించి .. అభిరుచుల గురించి చెప్పింది. తన వ్యక్తిగత విషయాలను.. వృత్తి గత విషయాలను ఎన్నడు పంచుకోలేదు.

ఇటీవల ఓ యూ ట్యూబ్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యూష తన కెరీర్.. ఇతర విషయాలను పంచుకుంది. వాస్తవానికి ప్రత్యూష ఆ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్ని విషయాలు చెబుతుందని ఎవరూ ఊహించలేదు. తనకు చానల్లో వచ్చిన అవకాశం గురించి.. రోజు ఎదురయ్యే సవాళ్ల గురించి ఆమె చెప్పుకొచ్చింది. ఆ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పటికి సోషల్ మీడియాలో సంచలనంగానే ఉంది. ఆమె మాట్లాడిన మాటలు.. చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

దీన్ని మర్చిపోకముందే మరో యూట్యూబర్ కు ఇంటర్వ్యూ వచ్చింది. ఈసారి మరింత ఓపెన్ అయింది ప్రత్యూష. ఎథిక్స్.. టి ఆర్ పి.. వీటిలో వీటికి మీరు ఓటు వేస్తారు అంటే.. టిఆర్పి రేటింగ్స్ అని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. టీవీ9 లో పనిచేసే ప్రేమ, దీప్తి.. ఇద్దరిలో ఎవరు ఇష్టమంటే.. ప్రత్యూష కాస్త గందరగోళానికి గురైంది. ఆ తర్వాత తనకు దీప్తి అంటే ఇష్టమని చెప్పింది. ఎందుకంటే తనకు రోజు షెడ్యూల్ వేసేది దీప్తి అని చెప్పుకొచ్చింది. ప్రేమ, నా హస్బెండ్.. వీరిలో ఎవరిష్టమంటే నా భర్త కంటే ప్రేమ అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది. భర్త కంటే కూడా ప్రేమ తోనే తనకు ఎక్కువ అవినాభావ సంబంధం ఉందని ప్రత్యూష చెప్పుకొచ్చింది.

ప్రత్యూష తన భర్త గురించి ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో కూడా బయటకు చెప్పలేదు. అయితే ఆయన కంటే ప్రేమ అనే జర్నలిస్టు తనకు ఎక్కువ అని చెప్పడం విశేషం. వాస్తవానికి ప్రత్యూష జోబియల్ పర్సన్. తన ప్రైవేట్ లైఫ్ గురించి పెద్దగా చెప్పుకోదు. పైగా తన భర్త సపోర్ట్ తోనే తను ఈ స్థాయి దాకా వచ్చానని ఆమె అనేక సందర్భాలలో చెప్పింది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో అలా చెప్పి ఉండవచ్చు గాని.. ప్రత్యూష తన భర్తను విపరీతంగా ప్రేమిస్తూ ఉంటుంది. ఆయన కూడా ఆమెపై అదే స్థాయిలో ప్రేమను కనబరుస్తూ ఉంటారు. దీనిని బట్టి ప్రత్యూష చెప్పింది కేవలం రేటింగ్స్ కోసమని అర్థం చేసుకోవచ్చు.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper