Homeఅంతర్జాతీయంChina India Relations: చైనా, భారత్‌ జట్టు.. అమెరికాకు కడుపుమంట

China India Relations: చైనా, భారత్‌ జట్టు.. అమెరికాకు కడుపుమంట

China India Relations: అగ్రరాజ్యం అమెరికా.. ఆసియాలో అగ్రరాజ్యం, ప్రపంచంలో రెండో ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశం చైనా. ఈ రెండు దేశాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఆగ్రస్థానం కోసం చైనా పోటీపడుతోంది. చైనాను ఎదగకుండా చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అసియాలో రెండు అతిపెద్ద దేశాలు, శక్తివంతమైన దేశాలుగా ఉన్న చైనా, భారత్‌ జట్టుకట్టకుండా అమెరికా పుల్లలు పెడుతూనే ఉంటుంది. అయినా ఇరు దేశాల మధ్య వైరుధ్యాలు ఉన్నపట్టికి పరస్పర సహకారం కూడా కొనసాగుతోంది. […]

China India Relations: అగ్రరాజ్యం అమెరికా.. ఆసియాలో అగ్రరాజ్యం, ప్రపంచంలో రెండో ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశం చైనా. ఈ రెండు దేశాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఆగ్రస్థానం కోసం చైనా పోటీపడుతోంది. చైనాను ఎదగకుండా చేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అసియాలో రెండు అతిపెద్ద దేశాలు, శక్తివంతమైన దేశాలుగా ఉన్న చైనా, భారత్‌ జట్టుకట్టకుండా అమెరికా పుల్లలు పెడుతూనే ఉంటుంది. అయినా ఇరు దేశాల మధ్య వైరుధ్యాలు ఉన్నపట్టికి పరస్పర సహకారం కూడా కొనసాగుతోంది. తాజాగా అమెరికా చైనా తయారీ వస్తువులపై తను విధించిన భారీ పన్నులను తప్పించుకోవడంలో భారత్‌ సహకరిస్తోందని ఆరోపణలు చేస్తోంది.

షాడో నెట్‌వర్క్‌ అని..
పీటర్‌ నవారో విడుదల చేసిన ‘ది గ్రేట్‌ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ స్కామ్‌’ నివేదికలో అమెరికా భారత్‌తోపాటు మరో 40 దేశాలను లక్ష్యంగా చేసుకుంది. చైనా వస్తువులు మధ్యలో ఇతర దేశాల మీదుగా తిరిగి వచ్చి అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నాయని వాదిస్తోంది. రీలేబులింగ్, రీప్యాకేజింగ్, మార్గం మార్చడం వంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారని చెప్తోంది. కానీ నిజానికి ఇది అమెరికా తన స్వంత వాణిజ్య నియమాలను ఇతరులపై రుద్దాలని చూస్తున్నప్పుడు వచ్చే అసహనం మాత్రమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2018 నుంచి ఆంక్షలు..
చైనాపై సెక్షన్‌ 301 కింద టారిఫ్‌లు విధించినప్పటి నుంచి అక్రమ సరుకు రవాణా పెరిగిందని, దాని విలువ 303 బిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తోంది. కార్మికుల ఖర్చు తక్కువగా ఉన్న, కస్టమ్స్‌ పర్యవేక్షణ సడలంగా ఉన్న దేశాల ద్వారా వస్తువులు తరలిస్తున్నారని చెప్తోంది. అయితే ఈ వాదనలోనే అమెరికా బలహీనత కనిపిస్తోంది. తన మార్కెట్‌లోకి చేరే వస్తువులను ‘చైనా తయారీ’ అని గుర్తించలేకపోగా, దానికి బదులు ఇతర దేశాలను నిందించడం అమెరికా వైఫల్యాన్ని బయటపెడుతోంది.

ఏఐ టూల్‌తో గుర్తించాలని..
‘డిటెక్టివ్‌ బోర్డర్‌’ అనే కొత్త ఏఐ సాధనంతో షిప్‌మెంట్‌ రికార్డులు, రూటింగ్‌ చరిత్ర, యజమానుల సంబంధాలను పరిశీలించి నిజమైన మూలాన్ని కనుగొంటామని అమెరికా చెబుతోంది. ఇది హాస్యాస్పదంగా ఉంది. చైనా, భారత్‌ వంటి దేశాలు తమ వాణిజ్య మార్గాలను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నప్పుడు అమెరికా ఆందోళన చెందుతుంది. ఇది కేవలం పోటీలో వెనకబడినప్పుడు వచ్చే కడుపుమంటలాంటిదే.

చైనా–భారత్‌ కలయిక అమెరికాకు నిజంగా బాధ కలిగిస్తోంది. సొంత ప్రయోజనాలను కాపాడుకుంటూ పరస్పర అవగాహన, సహకారంతో ముందుగు సాగుతున్నప్పుడు నిందలు మోపడం అమెరికాకు అలవాటైంది. ఇది తన బలహీనతను చూపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper