TV9 Ravi Prakash: తెలుగు మీడియాలో.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీ9 ఛానల్ లో ఏదైనా జరిగితే అది సంచలనంగానే ఉంటుంది. ఆ ఛానల్ ఏర్పాటే ఒక సంచలనం. అందులో జరుగుతున్న పరిణామాలు కూడా అదే బాపతు. రవి ప్రకాష్ దాన్ని ఏర్పాటు చేయడం.. ఒక లెవెaల్లోకి తీసుకెళ్లడం.. ఆ తర్వాత మేనేజ్మెంట్ మారిపోవడం.. రవి ప్రకాష్ బయటికి రావడం.. రకరకాల కేసులు ఎదుర్కోవడం.. ఇప్పటికీ ఇబ్బందులు పడుతూ ఉండడం..మేఘా, మై హోమ్ కంపెనీల మీద రవి ప్రకాష్ ఇప్పటికి కేసులను కొనసాగిస్తుండడం వంటి పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఏమైంది..
రవి ప్రకాష్ మళ్లీ టీవీ9 పీఠం మీదికి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యాజమాన్య, ప్రసార సరళి అంశాలు నిప్పులాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాది సీఈవో రవి ప్రకాష్ మళ్లీ టీవీ9లోకి అడుగు పెడతారనే వార్త సృష్టిస్తోంది.. సంస్థలు కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని.. ఎరిటోరియల్ పగ్గాలు రవి ప్రకాష్ చేతికి వస్తాయని.. ఒకప్పుడు తాను కోల్పోయిన స్థానంలో మళ్లీ రవి ప్రకాష్ కూర్చునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రసార శైలి, సంస్థకు సంబంధించిన లోగో వాటి విషయాలలో ప్రక్షాళన జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఇదంతా ఊహాగానమని కొంతమంది కొట్టి పారిస్తున్నారు. కొంతకాలంగా న్యాయస్థానాలు.. పోలీసు విచారణలు ఈ సంస్థలో జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ రూమర్లు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి.
బయటకు తెలియడం లేదు
వాస్తవానికి టీవీ9 లో ఏం జరిగినా సరే బయటికి వెంటనే తెలుస్తుంది. కానీ ఈసారి ఎటువంటి విషయం బయటకు తెలియడం లేదు. పైగా అటు యాజమాన్యం.. ఇటు రవి ప్రకాష్.. నిశ్శబ్దంగా ఉన్నారు. సంబంధిత వర్గాలు కూడా ఈ అంశం మీద మాట మాట్లాడటం లేదు. ఇదంతా ప్రచారమేనా.. లేదా ఏదైనా వాస్తవం ఉందా.. అనేది కొద్దిరోజులు ఆగితేనే తెలుస్తుంది.. వాస్తవానికి మీడియా రంగంలో ఇటువంటి సంఘటనలు ఇంతవరకు చోటు చేసుకోలేదు. టీవీ9 నుంచి రవి ప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత పోరాటాన్ని మరింత జోరుగా సాగించారు. అప్పట్లో అధికారంలో ఉన్న నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ ఛానల్ ను మూసివేసింది నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం. ఆ తర్వాత రవి ప్రకాష్ ఇప్పుడు ఆర్ టీవీ పేరుతో చానల్ నిర్వహిస్తున్నారు. కొన్ని పిడిఎఫ్ పత్రికలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో రవి ప్రకాష్ ఒకవేళ tv9లోకి ఎంట్రీ ఇస్తే అప్పుడు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. అప్పట్లో రవి ప్రకాష్ బయటికి వెళ్ళిన తర్వాత చాలామంది ఆయన అనుచరులు ఉత్తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వేరే ఛానల్స్ లో పనిచేస్తున్నారు. ఒకవేళ రవి ప్రకాష్ గనుక మళ్లీ ఎంట్రీ ఇస్తే.. వాళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది.