TV9: ఒకప్పుడు టీవీ9 ఎలా ఉండేది.. అందులో వార్తలు ఎలా ఉండేవి. నిప్పు కణిక లాగా.. భగభగ మండే విస్పోటనంలాగా.. కానీ ఇప్పుడు ఎలా మారిపోయింది.. రవి ప్రకాష్ వెళ్ళిపోయాడు. క్వాలిటీ మ్యాన్ పవర్ షిఫ్ట్ అయిపోయింది.. దీంతో టీవీ9 గత చరిత్రను తలుచుకుంటూ.. నడుస్తోంది.
టీవీ9 గతంలో శ్రీని రాజు ఆధ్వర్యంలో కొనసాగేది. ఆ తర్వాత ఈ ఛానల్ చేతులు మారింది. మై హోమ్..మేఘా కంపెనీలు దీనిని సొంతం చేసుకున్నాయి. తర్వాత టీవీ9 రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. టీవీ9 కొనసాగుతున్న కార్యాలయం పైనే ఆహా ఓటిటి కార్యకలాపాలు సాగిస్తోంది. ఇందులో కూడా మై హోమ్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. అల్లు అరవింద్.. మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు కుమారుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. టీవీ9 తో పాటు టెన్ టీవీ లో కూడా మై హోమ్.. మేఘా కంపెనీకి వాటాలు ఉన్నాయి. మై హోమ్ కంపెనీ టీవీ9 ను టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత.. అందులో వచ్చే వార్తలు.. ఇతర వ్యవహారాలు పూర్తిగా మేనేజ్మెంట్ కంట్రోల్లోకి వెళ్లిపోయాయి. గతంలో టీవీ9 లో ఎడిటోరియల్ టీం ఇండిపెండెంట్ గా వ్యవహరించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం ఒక్కసారిగా మారిపోయింది.
తాజాగా విజయవాడలో మై హోమ్ గ్రూపుకు సంబంధించి మహా సిమెంట్ డీలర్ల సమావేశం జరిగింది. వాస్తవానికి ఇది పూర్తిగా ప్రవేట్ వ్యవహారం. దీని వల్ల ఏపీ ప్రజలకు గాని.. తెలంగాణ ప్రజలకు గాని ఎటువంటి ఉపయోగం లేదు. ఒకవేళ ఈ వార్తను ప్రచురించాలి అనుకుంటే పేపర్లలో అయితే బిజినెస్ లో పబ్లిష్ చేస్తారు. టీవీలలో అయితే పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు మై హోమ్ కంపెనీ పెట్టుబడులు మొత్తం టీవీ9 లో ఉన్నాయి కాబట్టి.. మై హోమ్ గ్రూపుకు సంబంధించి మహా సిమెంట్ సమావేశాన్ని టీవీ9 గొప్పగా ప్రసారం చేసింది. పైగా ఈ కార్యక్రమానికి టీవీ9.. 10 టీవీ ప్రతినిధులు మాత్రమే హాజరయ్యారు. వాళ్లకు మాత్రమే మై హోమ్ ప్రతినిధులు ఆహ్వానం అందించారు. మై హోమ్ గ్రూపు డీలర్ల సమావేశానికి సంబంధించిన ఈ వార్తను టీవీ9 శుక్రవారం అనేక పర్యాయాలు చెప్పింది. ఇదేదో గొప్ప కార్యక్రమం లాగా కవరేజ్ ఇచ్చింది.. ఇక 10tv గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. రేటింగ్స్ విషయంలో ఇప్పటికి టీవీ9 నెంబర్ వన్. అందులో అనుమానం లేదు. కానీ ఆ నెంబర్ వన్ ఛానల్ చివరికి సిమెంట్ వార్తలను ప్రసారం చేస్తోంది. అదే ఇక్కడ అసలైన హాస్యాస్పదం. ఇక్కడ మీడియా ఎవరివల్ల.. ఎవరికి కోసం వార్తలు ప్రసారం చేస్తోంది అనే అనుమానం మీలో కలిగితే తప్పు మాది కాదు.
Maha Cements Dealers Meet : నోవాటెల్ హోటల్ లో మహా సిమెంట్స్ డీలర్స్ మీట్…- TV9#MahaCements #DealersMeet #Novotel #CementIndustry #BusinessEvent #DealersMeet2026 #BusinessNews #IndustryNews #AndhraPradesh #LatestNews #tv9telugu pic.twitter.com/2B5v26ybKO
— TV9 Telugu (@TV9Telugu) August 14, 2026