Udaya Bhanu : ఇప్పుడైతే బుల్లితెర పై యాంకర్ సుమ(Suma Kanakala) హవానే నడుస్తుంది కానీ, ఒకప్పుడు ఉదయభాను(Udaya Bhanu) హవా కూడా అదే రేంజ్ లో నడిచేది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, గత దశాబ్ద కాలం నుండి ఆమె బుల్లితెరకు దూరమైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ వంటి వాటిల్లో కూడా ఆమె కనిపించడం లేదు. అయితే రీసెంట్ గానే ఆమె ‘బార్బరిక్ త్రిబాణధారి’ అనే చిత్రం లో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకు అవకాశాలు రాకపోవడం పై సంచలన కామెంట్స్ చేసింది. బుల్లితెర లో కూడా ఒక పెద్ద సిండికేట్ నడుస్తుందని, వాళ్ళ కారణంగానే నాకు అవకాశాలు బాగా తగ్గిపోయాయని చెప్పుకొచ్చింది ఉదయ భాను. తనకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉంది, మీడియా ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.
అది కాసేపు పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఉదయభాను చిరంజీవి(Megastar Chiranjeevi), బాలకృష్ణ(Nandamuri Balakrishna) గురించి పలు ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘సిండికేట్ ఉంది అంటున్నారు. మరి మీకు ఒకప్పుడు అవకాశాలు బాగానే వచ్చాయి కదా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అవకాశాలు నాకు ఒకప్పుడు కుప్పలు తెప్పలు గా ఏమి రాలేదు. ఒక్కో ఛానల్ లో ఒక్కో షో మాత్రమే వచ్చేది. ఏ యాంకర్ చూపించినంత డెడికేషన్ ని నేను చూపించేదానిని. ఒక షో కోసం స్కై డైవింగ్ చేశాను. మరో షో కోసం బంగీ జంప్ కూడా చేశాను. ఆరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే అలాంటిది చేశారు. ఆయన తర్వాత బంగీ జంప్ చేసింది నేనే. కానీ చిరంజీవి గారికి వచ్చినంత గురింపు నాకు రాలేదు. ఎందుకంటే ఆయన స్టార్ హీరో కదా. ఆయనకు వచ్చేంత గుర్తింపు దేవుడు నాకు రానివ్వలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
యాంకర్ మరో ప్రశ్న అడుగుతూ ‘మీరు బాలయ్య గారిని ఎంతో ఇష్టపడుతారు. ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతారు. దీనికి ఇతర హీరోల అభిమానులు బాధపడుతున్నారు కదా , వాళ్లకు ఏమని సమాధానం ఇస్తారు?’ అని అడగ్గా, దానికి ఉదయభాను సమాధానం చెప్తూ ‘బాలయ్య బాబు నా జీవితం లో ఒక ఎమోషన్. నన్ను ఎప్పుడూ ఆయన తన సొంత సోదరి లాగానే చూస్తాడు. ఎంతో ఆప్యాయతతో నా బిడ్డలను తన దగ్గరకు చేరదీస్తాడు. రీసెంట్ గానే ఆయన దగ్గరకు నా ఇద్దరు కవల పిల్లలను తీసుకెళ్ళాను. అప్పుడే వీళ్లిద్దరు ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారా?, నా కోడళ్లు, ఇటు రండ్రా ఫోటోలు దిగుదాం అని ఆయన మోకాళ్ళ మీద కూర్చొని నా ఇద్దరి బిడ్డలను ప్రేమతో హత్తుకొని ఎంతో ఆప్యాయతని చూపించాడు. నన్ను తన సొంత చెల్లి లాగా ఆయన చూసుకుంటున్నప్పుడు నేనెందుకు ఆయన గురించి గొప్పగా మాట్లాడకూడదు’ అంటూ చెప్పుకొచ్చింది ఉదయభాను.