spot_img
Homeతెలంగాణగ్రేటర్‌‌లో గులాబీ బాస్‌ వెరైటీ వ్యూహం

గ్రేటర్‌‌లో గులాబీ బాస్‌ వెరైటీ వ్యూహం

KCR-TRS

ఏ ఎన్నికలోనూ ఓటమి ఎరుగని టీఆర్‌‌ఎస్‌ పార్టీకి.. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్యంగా పరాజయం ఎదురైంది. దీంతో గులాబీ బాస్‌ దీనిని చాలెంజ్‌గా తీసుకున్నారు. దుబ్బాక గెలుపుతో విర్రవీగిపోతున్న బీజేపీకి షాక్‌ ఇవ్వాలని చూస్తున్నారు. ఇందుకు గ్రేటర్‌‌ ఎన్నికలను ఆయుధంగా వాడనున్నారు. మిగిలిన పార్టీలతో పోలిస్తే.. గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు.. ఆ ఎన్నికల్లో గతంలో మాదిరి ఫలితాన్ని రిపీట్ చేసేందుకు దాదాపుగా ఏడాదికి పైనే కసరత్తు చేస్తున్నారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. తమకున్న అధిక్యతను ప్రదర్శించటం ద్వారా తమ దరిదాపుల్లోకి ఎవరూ రాలేరన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలన్నదే గులాబీ బాస్ భావిస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ కు షాక్.. గ్రేటర్ లో బీజేపీ తరుఫున విజయశాంతి ప్రచారం

అయితే.. గ్రేటర్‌‌ ఎన్నికల్లో బాస్‌ ఎలంటి వ్యూహాలు రచిస్తున్నారో ఒక్కొక్కటిగా బయటకు పొక్కుతున్నాయి. గ్రేటర్‌‌లోని 150 స్థానాల్లో బరిలోకి దిగిన టీఆర్ఎస్.. ఏ డివిజన్‌కు ఆ డివిజన్‌కు వేర్వేరు వ్యూహాలను సిద్ధం చేసుకోవటం గమనార్హం. గ్రేటర్ మొత్తానికి ఒకటే వ్యూహంగా కాకుండా.. గతంలో తాము గెలుచుకున్న స్థానాలతోపాటు.. మరికొన్నింటి మీదా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందుకోసం తనకున్న వనరులు మొత్తాన్ని వినియోగించుకోవటంతోపాటు.. పార్టీ శ్రేణుల్ని మొత్తంగా కదలించి.. హైదరాబాద్‌లో పాగా వేసేలా చేశారని చెబుతున్నారు.

Also Read: టీఆర్ఎస్ వర్సెస్ మజ్లిస్.. కొట్లాట పైకి మాత్రమేనా?

150 డివిజన్ల బాధ్యతను పలువురు నేతలకు అప్పజెప్పారు. ఒక్కో డివిజన్‌కు కనిష్ఠంగా ఒక ఇన్‌చార్జి.. గరిష్ఠంగా నలుగురు ఇన్‌చార్జీలను పెట్టారు. ఇందుకోసం మంత్రులు.. ఎంపీలతోపాటు.. ఎమ్మెల్సీలను రంగంలోకి దించారు. 62 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు గ్రేటర్‌‌లోని పలు డివిజన్ల బాధ్యతలను చూస్తున్నారు. చివరకు గ్రేటర్ ఎన్నికల బాధ్యతను తీసుకున్న మంత్రి కేటీఆర్ సైతం.. ఓ డివిజన్‌ బాధ్యత తీసుకున్నారు. గ్రేటర్ శివారులోని హైదర్‌‌నగర్ డివిజన్‌కు మంత్రి కేటీఆర్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ డివిజన్‌కు కేటీఆర్ తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ కె.రవీందర్‌‌రావును నియమించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఆయనతోపాటు నిజాంపేట కార్పొరేషన్ మేయర్ నీలా గోపాలరెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. అంతేకాదు.. 76 బూత్‌లకు 15 మంది చొప్పున బాధ్యులను నియమించారు. ఇందుకోసం సిరిసిల్ల నుంచి 800 మందిని రప్పించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. సిరిసిల్ల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 3,500 మందిని రప్పించి హైదరాబాద్‌లోని వివిధ డివిజన్లలో ప్రచారానికి దించటం గమనార్హం. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ అనుసరించని వ్యూహాన్ని సీఎం కేసీఆర్ ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు. మరి కేసీఆరా.. మజాకా..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ డైరెక్టర్ తో సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాడుగా…

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమ ఐడెంటిటిని కాపాడుకుంటూ స్టార్ హీరోల రేంజ్ లో ముందుకు దూసుకు వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరు వాళ్లను వాళ్ళు...
Oktelugu Epaper