spot_img
Homeప్రత్యేకంఆ నీళ్లతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చా..?

ఆ నీళ్లతో మధుమేహానికి చెక్ పెట్టవచ్చా..?

డయాబెటిస్ ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వ్యాధి బారిన పడి ఉంటారు. డయాబెటిస్ రావడం వల్ల మన శరీరం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణ చేయడానికి తగిన మోతాదులో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో డయాబెటిస్ తో బాధపడే వారికి వైద్యులు ఎన్నో సూచనలు ఇస్తున్నారు. ఆహార విషయంలో సరైన డైట్ ని ఫాలో అవుతూ,శరీరానికి తగిన వ్యాయామం చేయడం ద్వారా కొంతవరకు ఈ డయాబెటిస్ ను కంట్రోల్ చేయొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా సాఫ్ట్ డ్రింక్స్, వంటివాటిలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం ఎంతో మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితోపాటు డయాబెటిస్ ను కంట్రోల్ చేయడానికి మెంతి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తాజా పరిశోధనల్లో నిపుణులు వెల్లడించారు….

మెంతులు చూడటానికి చిన్నవిగా బంగారు వర్ణంలో ఉన్నప్పటికీ, వాటి రుచి మాత్రం కొద్దిగా చేదుగా ఉండటం వల్ల తినడానికి ఇష్టపడరు. కానీ ఈ మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. బ్లడ్ షుగర్ ను నియంత్రించడంలో మెంతి నీళ్లు ఎంతో ఉపయోగపడతాయని పలు పరిశోధనల్లో రుజువైంది. డయాబెటిస్ తో బాధపడేవారు ఈ నీటిని తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్ అధిక మోతాదులో ఉత్పత్తి చేసి షుగర్ గ్రహింపును తగ్గిస్తుంది.

ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ మెంతులను ఒక చిన్న గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఉదయం లేవగానే ఆ మెంతులను తీసేసి పరగడుపున ఆ నీటిని తాగటం వల్ల డయాబెటిస్ నుంచి విముక్తి పొందవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు. మెంతులు కేవలం డయాబెటిస్ కి ఉపశమనం కలిగించడమే కాకుండా, ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరచి, ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. అలాగే దగ్గు జలుబు గొంతునొప్పి వంటి సమస్యలకు మెంతులు ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Oktelugu Epaper