Homeఎంటర్టైన్మెంట్Celebrities: సెలబ్రిటీలకు ఇదేం పాడు బుద్ధి.. డబ్బు కోసం ఇంత దిగజారుడుతనమా

Celebrities: సెలబ్రిటీలకు ఇదేం పాడు బుద్ధి.. డబ్బు కోసం ఇంత దిగజారుడుతనమా

Celebrities: డబ్బు ఎవరికీ చేదు కాదు. డబ్బు ఇచ్చే సౌకర్యం ప్రపంచంలో మరేది ఇవ్వదు. డబ్బు సంపాదించాలని ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకుంటారు.. కొందరు డబ్బును అవసరాల వరకు సంపాదించుకుంటే.. మరికొందరేమో తరాలకు సరిపడా సంపాదిస్తూ ఉంటారు. ఇంత డబ్బు సంపాదించినప్పటికీ చివర్లో తీసుకెళ్లేది ఏదీ ఉండదు. ఇది తెలిసినప్పటికీ కూడా చాలామంది డబ్బు మీద ఆశను చంపుకోలేరు. డబ్బు సంపాదించడానికి కొంతమంది కష్టపడుతుంటారు. మిగతా మంది సులువైన మార్గాలను వెతుకుతూ ఉంటారు. ఆ మార్గాలను వెతికే […]

Celebrities: డబ్బు ఎవరికీ చేదు కాదు. డబ్బు ఇచ్చే సౌకర్యం ప్రపంచంలో మరేది ఇవ్వదు. డబ్బు సంపాదించాలని ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకుంటారు.. కొందరు డబ్బును అవసరాల వరకు సంపాదించుకుంటే.. మరికొందరేమో తరాలకు సరిపడా సంపాదిస్తూ ఉంటారు. ఇంత డబ్బు సంపాదించినప్పటికీ చివర్లో తీసుకెళ్లేది ఏదీ ఉండదు. ఇది తెలిసినప్పటికీ కూడా చాలామంది డబ్బు మీద ఆశను చంపుకోలేరు.

డబ్బు సంపాదించడానికి కొంతమంది కష్టపడుతుంటారు. మిగతా మంది సులువైన మార్గాలను వెతుకుతూ ఉంటారు. ఆ మార్గాలను వెతికే క్రమంలో తమను తాము కోల్పోతుంటారు. చివరికి తమ స్థాయిని తగ్గించుకొని.. దిగజారుడుతనానికైనా వెనుకాడరు. పైగా డబ్బే వారికి అంతిమం. పైగా సమాజంలో పేరు రావాలి.. ప్రఖ్యాతలు అంతకంటే ఉండాలి.. నిత్యం మీడియాలో ఉండాలి అనుకుంటారు కాబట్టి.. విలువలను.. వలువలను కోల్పోతూ ఉంటారు.

నేటి సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీలు డబ్బు సంపాదించే విషయంలో దిగజారి పోతున్నారు. ఏం చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అర్థం కావడం లేదు. ముఖ్యంగా బుల్లితెరలో పేరు తెచ్చుకున్న వారు డబ్బు సంపాదించడానికి పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనే విధానానికి పాల్పడుతున్నారు. ఫేస్బుక్.. లేదా ఇన్స్టాగ్రామ్.. వాటి వాటిల్లో సబ్స్క్రిప్షన్ ఫీజు ఖరారు చేశారు. దీని ద్వారా అదనంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క సబ్స్క్రైబర్ కు ఇంత అమౌంట్ అని రేటు ఫిక్స్ చేశారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఎక్స్క్లూజివ్ కంటెంట్ లభిస్తుంది. అలాగని ఆ కంటెంట్ గొప్పది కాదు. చెప్పుకునేది కాదు. కేవలం ఆ నటీమణుల అంగాంగ ప్రదర్శన చూడటమే. ఆ సెలబ్రిటీలకు మంచి పేరుంది. అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏదైనా కొత్తగా చేస్తే డబ్బు వచ్చే అవకాశం ఉంది. కానీ అలా కాకుండా ఇలాంటి కంటెంట్ తో రావడం.. సబ్ స్క్రిప్షన్ ఫీజు ఖరారు చేయడం నిజంగా అత్యంత బాధాకరం.

ఇటువంటి విధానానికి పాల్పడుతున్న సెలబ్రిటీలను సమాజం ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి… సెలబ్రిటీలకు ఎంత కొంత సమాజ బాధ్యత ఉంటుంది కదా. ఈ సమాజం వాళ్లకు చాలా ఇచ్చింది కదా. అలాంటప్పుడు సమాజానికి వారు మంచే ఇవ్వాలి కదా. అలాంటివి పట్టించుకోకుండా ఇలా వ్యవహరించడం నిజంగా సెలబ్రిటీల దిగజారుడుతనానికి బలమైన నిదర్శనం. దీని ప్రకారం డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు.. విలువలను కోల్పోతుంటారు.. వలువలను వదిలేస్తుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper