Homeఆంధ్రప్రదేశ్‌DSC Controversy: నేను పక్కా వైసిపి.. డీఎస్సీ 2025 టీచర్ వార్నింగ్!

DSC Controversy: నేను పక్కా వైసిపి.. డీఎస్సీ 2025 టీచర్ వార్నింగ్!

DSC Controversy: ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ 2025 చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దగా డిఎస్సి పేరిట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదే సందర్భంలో 2025 డిఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు ఆత్మగౌరవం పేరుతో ఆందోళనలు చేపడుతున్నారు. అహర్నిశలు శ్రమించి ఉపాధ్యాయులుగా ఎంపిక అయితే.. తమను ఇబ్బందుల్లో పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలామంది ఎమోషనల్ అవుతూ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ […]

DSC Controversy: ప్రస్తుతం రాష్ట్రంలో డీఎస్సీ 2025 చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దగా డిఎస్సి పేరిట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అదే సందర్భంలో 2025 డిఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు ఆత్మగౌరవం పేరుతో ఆందోళనలు చేపడుతున్నారు. అహర్నిశలు శ్రమించి ఉపాధ్యాయులుగా ఎంపిక అయితే.. తమను ఇబ్బందుల్లో పెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలామంది ఎమోషనల్ అవుతూ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఉపాధ్యాయుడు వ్యక్తం చేసిన ఆవేదన అంతా ఇంతా కాదు. చాలా ఎమోషనల్ తో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి అందర్నీ ఆలోచనలో పెడుతున్నాయి.

* ఏటా డీఎస్సీ ప్రకటనతో..
2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. నవరత్నాల్లో భాగంగా చాలా హామీలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో నిరుద్యోగ యువత ఎక్కువగా నమ్మారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఓటు వేశారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారంటే ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో లక్షలాదిమంది అభ్యర్థులకు ఎదురుచూపు తప్పలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు 6000 పోస్టులతో. కనీసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డీఎస్సీ నోటిఫికేషన్ నిలిచిపోయింది. అయినా సరే నిరుద్యోగుల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పనిచేశారు. అప్పట్లో డిఎస్సీ అభ్యర్థుల సైతం 2024 ఎన్నికల్లో ఓటు వేశారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది. కానీ ఏడాదిన్నర కిందట జరిగిన రిక్రూట్మెంట్ కు సంబంధించి వైసిపి ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో ఎంపికైన ఉపాధ్యాయులంతా వైసిపి పై ఆవేదనతో ఉన్నారు.

* ఎమోషనల్ కామెంట్స్..
డీఎస్సీ 2025 పై విష ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్త ఉపాధ్యాయులంతా ఆత్మగౌరవం పేరుతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఉపాధ్యాయుడు అయితే తాను పక్కా వైసిపి అని.. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత మూడుసార్లు ఆ పార్టీకి ఓటు వేశానని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు తప్పుడు ప్రచారంతో తమలాంటి వారి పొట్ట కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు. అయితే ఆయన ఒక్కరే కాదు ఎంపికైన 16000 మంది ఉపాధ్యాయుల్లో ఎక్కువమంది వైసీపీ సానుభూతిపరులు. అటువంటి వారంతా జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై రగిలిపోతున్నారు. ఆ పార్టీ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు..

 

View this post on Instagram

 

A post shared by THE-GUNTUR-TIMES (@the_guntur_times)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper