Homeట్రెండింగ్ న్యూస్Old City Hyderabad : అతడికి 60.. ఆమెకు 25.. ఇద్దరికీ పెళ్లి.. చివరికి జరిగింది...

Old City Hyderabad : అతడికి 60.. ఆమెకు 25.. ఇద్దరికీ పెళ్లి.. చివరికి జరిగింది ఇదీ

Old City Hyderabad : సరైన ఈడు ఉండాలి. దానికి తగ్గట్టుగానే జోడు ఉండాలి. అప్పుడే ఆ జంట బాగుంటుంది. వారిద్దరి మధ్య వైవాహిక జీవితం గొప్పగా ఉంటుంది. ఇలా కాకుండా ఈడు జోడు విషయంలో ఏదైనా తేడా జరిగితే సంసారం సంక నాకి పోతుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య వయసు అంతరం రెండు నుంచి నాలుగు సంవత్సరాలకు మించి ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ అంతరం దాటిపోతే భవిష్యత్తు కాలంలో అనేక రకాల సమస్యలు […]

Old City Hyderabad : సరైన ఈడు ఉండాలి. దానికి తగ్గట్టుగానే జోడు ఉండాలి. అప్పుడే ఆ జంట బాగుంటుంది. వారిద్దరి మధ్య వైవాహిక జీవితం గొప్పగా ఉంటుంది. ఇలా కాకుండా ఈడు జోడు విషయంలో ఏదైనా తేడా జరిగితే సంసారం సంక నాకి పోతుంది.

వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య వయసు అంతరం రెండు నుంచి నాలుగు సంవత్సరాలకు మించి ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ అంతరం దాటిపోతే భవిష్యత్తు కాలంలో అనేక రకాల సమస్యలు వస్తాయని పెద్దలు ఏనాడు హెచ్చరించారు. కానీ నేటి కాలంలో అలా జరగడం లేదు. వయసు అంతరాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బు.. స్టేటస్.. ఇతర విషయాలు మాత్రమే చూస్తున్నారు.

వయసు అంతరాన్ని లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంటే వచ్చే అనర్ధాలు తీవ్రంగా ఉంటాయి. అయితే వీటిని అంచనా వేయకుండా ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు.. అది కూడా తనకంటే 35 సంవత్సరాలు చిన్నదైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చివరికి అతడికి ఎలాంటి అనుభవం ఎదురయింది.. ఆ యువతి ఏం చేసిందో ఈ కథనంలో తెలుసుకుందాం..

పాత బస్తికి చెందిన ఓ 60 సంవత్సరాల వ్యక్తికి. గతంలోనే వివాహం జరిగింది. కాకపోతే అతని భార్య చనిపోయింది. పిల్లలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ క్రమంలో అతడికి ఒక తోడు కావలసి వచ్చింది. మ్యాట్రిమోనీ సైట్లలో ప్రకటన ఇచ్చాడు. అతడికి ఒక పేరయ్య ద్వారా సంబంధం తెలిసింది. దీంతో అతడు వారిని సంప్రదించాడు. వారు మొత్తానికి ఒక సంబంధాన్ని కుదిరించారు. ఆ అమ్మాయి పేద కుటుంబానికి చెందింది. ఇతడిని పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టమని చెప్పింది. పెళ్లి చేసే స్థాయి తమకు లేదని చెప్పడంతో ఆ ఖర్చు మొత్తం అతనే భరించాడు. పెళ్లికి దాదాపు 6 లక్షల వరకు ఖర్చయింది. దీనికి తోడు ఆ అమ్మాయికి డబ్బు కూడా ఇచ్చాడు.. బంగారం కూడా చేయించాడు. అయితే పెళ్లి జరిగిన మరుసటి రోజే ఆ అమ్మాయి పారిపోయింది. దీంతో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.. మీడియా ద్వారా ఈ విషయం బయటకు తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper