Homeఎంటర్టైన్మెంట్Palla Burusu First Review: 'పళ్ళ బురుసు' మూవీ ఫస్ట్ రివ్యూ...

Palla Burusu First Review: ‘పళ్ళ బురుసు’ మూవీ ఫస్ట్ రివ్యూ…

Palla Burusu First Review: ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళ బురుసు’ అనే సినిమా ఈ నెల 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది… ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ మీద నాగార్జున నిర్మిస్తుండటం విశేషం… ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలైతే వీక్షించారు. వాళ్లు ఈ సినిమాను చూసి వల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ విషయాలు […]

Palla Burusu First Review: ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళ బురుసు’ అనే సినిమా ఈ నెల 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది… ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ మీద నాగార్జున నిర్మిస్తుండటం విశేషం… ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలైతే వీక్షించారు. వాళ్లు ఈ సినిమాను చూసి వల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…

‘పళ్ల బురుసు’ (బ్రష్) కోసం తండ్రి కొడుకుల మధ్య ఒక పెద్ద యుద్ధ జరుగుతుంది. అది కోర్టు వరకు వెళుతుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి గల కారణం ఏంటి అనేదే ఈ మూవీ స్టోరీ గా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కూడా నాగార్జున లాంటి నటుడు ఇలాంటి ఒక చిన్న సినిమాను నిర్మించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఉదయ్ చౌహాన్ అనే వ్యక్తి ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.

కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది…మూవీ చూసిన సినీ పెద్దలు సైతం సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండటమే కాకుండా హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయని చెబుతున్నారు.

అలాగే తండ్రి కొడుకులు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సైతం ప్రేక్షకుడిని విశేషంగా అలరించాయంటూ వాళ్ళు చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఈ సినిమా మరో బలగం లాంటి సక్సెస్ సాధిస్తుందా? ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper