Homeఆంధ్రప్రదేశ్‌Amaravati: రేపే అమరావతిలో కీలక ఘట్టం.. జగన్ పై ట్రోల్స్!

Amaravati: రేపే అమరావతిలో కీలక ఘట్టం.. జగన్ పై ట్రోల్స్!

Amaravati: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధం అవుతోంది. రాజధానికే అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డును రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. విజయవాడ- మంగళగిరి రహదారిని అనుసంధానం చేసేలా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర సచివాలయం నుంచి చెన్నై కోల్కత్తా రహదారిని కలిపేలా ఈ సీడ్ యాక్సిస్ రహదారిని నిర్మించారు. మొన్న మధ్యాహ్నం సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించిన నిర్వాసితులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. […]

Amaravati: అమరావతి రాజధాని నిర్మాణంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధం అవుతోంది. రాజధానికే అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డును రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. విజయవాడ- మంగళగిరి రహదారిని అనుసంధానం చేసేలా ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రాష్ట్ర సచివాలయం నుంచి చెన్నై కోల్కత్తా రహదారిని కలిపేలా ఈ సీడ్ యాక్సిస్ రహదారిని నిర్మించారు. మొన్న మధ్యాహ్నం సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించిన నిర్వాసితులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వారికి పరిహారం విషయంలో సంతృప్తి కలగకపోవడంతో కొంతమంది వైసీపీ నేతలు ఒత్తిడితో వారు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లారు. అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణ? పెద్దదా? అంటూ అవగాహన లేని మాట్లాడారు జగన్. ఇప్పుడు అదే రోడ్డు రేపు ప్రారంభం కానుండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి కామెంట్స్.

* అన్ని రోడ్లకు అనుసంధానం..
అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తోంది. అయితే అమరావతిని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేది మాత్రం సీడ్ యాక్సిస్ రోడ్డు. అమరావతి రాజధాని ప్రతిపాదన చేసినప్పుడే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకు కూడా ప్రణాళిక రూపొందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు ప్రారంభమైన క్రమంలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ రోడ్డు ప్రాజెక్టు కోసం మొత్తం 320.54 ఎకరాల భూమి అవసరం అని గుర్తించారు. ఇప్పటికే 789.93 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూ సేకరణ ప్రక్రియ తుది దశలో ఉంది. ఈ రోడ్డు కేవలం రవాణా కోసమే కాకుండా రాజధాని నగరంలో గ్యాస్ పైప్ లైన్లు, వాటర్ మెయిన్స్, ఐసిటీ కారిడార్లు వంటి భూగర్భ వసతుల ఏర్పాటుకు ఉపయోగించనున్నారు. ప్రత్యేకంగా నిర్మిస్తున్న ఈ రహదారికి సీడ్ యాక్సిస్ రోడ్డు అని పేరు పెట్టారు.

* జాతీయ రహదారికి లింక్..
అమరావతి రాజధాని ప్రాంతంలో దొండపాడు నుంచి విజయవాడ- మంగళగిరి రోడ్డు వరకు 21.78 కిలోమీటర్ల మేర 9 వరుసుల రహదారిగా సీడ్ యాక్సిస్ రోడ్డును తీర్చిదిద్దుతున్నారు. రాజధాని లో ఉత్తరం నుంచి దక్షిణానికి నిర్మిస్తున్న ప్రతి రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డుతో అనుసంధానం చేస్తారు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు దొండపాడు వద్ద ప్రారంభమై రాయపాడు, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి గ్రామాల మీదుగా సాగి మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో కలుస్తుంది. 11 మీటర్ల వెడల్పుతో కూడిన క్యారేజ్ వేస్, సర్వీస్ రోడ్లు, సెంట్రల్ బిఆర్పిఎస్ కారిడార్ తో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. రేపు సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు.

* రైతులు కలిసిన క్రమంలో..
అయితే సీడ్ యాక్సిస్ రోడ్డు ఆలస్యం కావడానికి కొంతమంది రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడమే కారణం. అమరావతి రైతుల మాదిరిగా నష్టపరిహారం తో పాటు రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా కోరారు. కొంతమంది అదనపు పరిహారం కోరడంతో జాప్యం జరిగింది. ఈ క్రమంలో జూన్ రెండున కొంతమంది అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లికి వెళ్లి కలిశారు. ప్రధానంగా సీడ్ యాక్సిస్ రోడ్డు గురించి జగన్కు అవగాహన లేక అక్కడున్న రైతులకు అడగడం కనిపించింది. ఇప్పుడు అదే సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో.. నాటి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను జతచేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by TDP AT 175 (@tdpat175)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper