ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. సవాళ్లు మొత్తం దాటుకొని ఆరు గ్యారెంటీలు విధిగా అమలు చేయాల్సిన బాధ్యత కొత్తగా కొలువుదీరే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉంది.
కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోయి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి... ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులు బలంగా చెప్పగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది.
తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఢిల్లీలోని కాంగ్రెస్ పద్దలను ఆహ్వానించిన రేవంత్.. తిరిగి హైదరాబాద్ పయనవయ్యేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ తరుణంలో ఆయనకు ఏఐసీసీ నుంచి పిలుపు రావడం కలకలం రేపింది.
నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన రజిని దివ్యాంగురాలు. ఈమె ఎంకాం పూర్తిచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటి రాలేదు. దివ్యాంగురాలని ప్రైవేట్ సంస్థలూ అవకాశం ఇవ్వలేదు.
ఢిల్లీలో తెలంగాణ మంత్రివర్గం కూర్పు దాదాపు పూర్తయింది. అంతకుముందు తెలంగాణ సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు ఏఐసీసీ పరిశీలకుడు డీకే.శివకుమార్‌ను కలిశారు.
కాంగ్రెస్ అగ్రనేతలు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతోపాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు.
రేవంత్ అదృష్ట సంఖ్య 9 అనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. కేసీఆర్ వాహనాలన్నింటిపైనా 6 ఉంటే.. రేవంత్ వాహనాలపై 9 ప్రధానంగా ఉంటుంది. కానీ.. కేసీఆర్ అదృష్ట సంఖ్య ఈసారి ఆయనకు కలిసిరాలేదు.
కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయిలో చూసుకుంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అనేది అత్యున్నతమైనది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా 30 సంవత్సరాల లో ఎప్పుడూ లేదు.
కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సిఎల్పీ నాయకుడు ఎవరు కావాలి? ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే దానిపై ఇటీవల ఎల్లా హోటల్లో సుదీర్ఘ సమావేశం జరిగింది.
తెలంగాణలో గడచిన పది సంవత్సరాలలో ఐటి శాఖను కేటీ రామారావు పర్యవేక్షించారు. జయేష్ రంజన్ వంటి వారు సెక్రటరీ హోదాలో ఐటీ శాఖ ఉన్నతి కోసం పనిచేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు రేవంత్ రెడ్డి జన్మించారు.
కేసీఆర్‌కు తెలంగాణలో ఫామ్‌హౌస్ సీఎంగా ముద్రపడింది. అధికారంలో ఉన్నన్నినాళ్లు సచివాలయానికి రాలేదు. కొత్త సచివాలయం నిర్మిచంకున్నా.. కొటి రెండుసార్లు మాత్రేమ వచ్చారు. అధికార యంత్రాంగాన్ని తన ఫామ్ హౌస్‌కు రప్పించుకోవడం, మంత్రివర్గ సమావేశాలు కూడా ఫామ్‌హౌస్‌లో నిర్వహించడంతో ప్రజలు కూడా ఫామ్‌హౌస్ సీఎం అని ఫిక్స్ అయ్యారు.
రేవంత్‌రెడ్డి ముందు ముఖ్యమంత్రిగా అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే సీనియర్లు జూనియర్లు , కొత్త, పాత మధ్య గ్యాప్ ఉంది. మంత్రివర్గ కూర్పు పెద్ద సవాల్.
తెలంగాణలో వన్‌మెన్ ఆర్మీ షో ఉండదని, టీం వర్క్ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ కూర్పుపై పడింది.
తెలంగాణ ఎన్నికల తో పాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు వచ్చి ఉంటే చంద్రబాబు వ్యూహం మరోలా ఉండేది. ఇండియా కూటమి వైపు స్వేచ్ఛగా అడుగులు వేసేవారు.
ఐటీ శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో నలుగురు ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
2017 అక్టోబర్‌లో టీడీపీకి పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్‌రెడ్డి. 3 ఏళ్ల అనధికాలంలోనే ఎవ్వరికి దక్కని హోదాతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించింది.