HomeతెలంగాణHyderabad Real Estate: ఈ అపార్ట్మెంట్ లో ప్లాట్ ధర అక్షరాల 10 కోట్లు..

Hyderabad Real Estate: ఈ అపార్ట్మెంట్ లో ప్లాట్ ధర అక్షరాల 10 కోట్లు..

Hyderabad Real Estate: ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షలు ఉంటే సరిపోయేది. నగరం అభివృద్ధి చెందడం మొదలు పెట్టిన తర్వాత.. ఆ 50 కాస్త కోటి రూపాయలకు చేరుకుంది. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి అయిన తర్వాత.. రియల్ ఎస్టేట్ సంస్థలు శివారు ప్రాంతాలను డెవలప్ చేయడం మొదలుపెట్టాయి. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ అవతారం ఎత్తడంతో రియల్ ఎస్టేట్ రెక్కలు తొడిగింది. ఎకరం భూమి విలువ వందల కోట్లు దాటిపోవడంతో.. […]

Hyderabad Real Estate: ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకోవాలంటే 50 లక్షలు ఉంటే సరిపోయేది. నగరం అభివృద్ధి చెందడం మొదలు పెట్టిన తర్వాత.. ఆ 50 కాస్త కోటి రూపాయలకు చేరుకుంది. అప్పట్లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి అయిన తర్వాత.. రియల్ ఎస్టేట్ సంస్థలు శివారు ప్రాంతాలను డెవలప్ చేయడం మొదలుపెట్టాయి. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ అవతారం ఎత్తడంతో రియల్ ఎస్టేట్ రెక్కలు తొడిగింది. ఎకరం భూమి విలువ వందల కోట్లు దాటిపోవడంతో.. గృహాల ధరలు.. ప్లాట్ల ధరలు భారీగా పెరిగిపోయాయి.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని కోకాపేట, గండిపేట మధ్యలో ఒక ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇది అత్యంత డిమాండ్ కలిగిన ప్రాంతం. పేరుకు తగ్గట్టుగానే ఇది ఈ ప్రాంతంలో ఒక ఐకాన్ లాగా కనిపిస్తోంది. ఈ అపార్ట్మెంట్ లో నిలబడి చూస్తే గండిపేట చెరువు సరికొత్తగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఉన్న బిజినెస్ టైకూన్ లు.. ఇతర పెద్ద పెద్ద ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేసే విధంగా ఈ అపార్ట్మెంట్ తీర్చిదిద్దారు. మొత్తంగా 45 అంతస్తుల ఎత్తులో దీనిని నిర్మించారు

45 అంతస్తుల ఎత్తు ఉన్నప్పటికీ ఇందులో కేవలం 60 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. వాస్తవానికి ఇటువంటి భవనంలో చాలావరకు ఫ్లాట్లు ఉంటాయి. కానీ నిర్మాణదారులు ప్రైవసీకి ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తంగా 6,800 చదరపు అడుగుల విస్తీర్ణం లో ప్లాట్లను డిజైన్ చేశారు. ప్రారంభ ధర 10 కోట్లుగా నిర్ణయించారు. ఇక 15 వేల చదరపు అడుగుల వైశాల్యం. పెంట్ హౌస్ ఉండే ప్లాట్ ధరను తేకంగా 20 కోట్ల వరకు నిర్ణయించారు. ఇందులో 25 అడుగుల ఎత్తులో ప్రైవేట్ బాల్కనీ ఉంటుంది. టెర్రస్.. లగ్జరీ ఇంటీరియర్ లు కూడా ఇందులో ఉంటాయి.

నిర్మాణ కంపెనీ ఏ స్థాయిలో ఖర్చుపెట్టి దీనిని నిర్మిస్తుందో తెలియదు గానీ.. గండిపేట ప్రాంతానికి ఈ అపార్ట్మెంట్ ల్యాండ్ మార్క్ లాగా కనిపిస్తోంది. ఇప్పటికైతే ఆ ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ మాత్రమే ఉంది. వచ్చే రోజుల్లో ఆ ఏరియా రూపు రేఖలు మొత్తం మారే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఇక ఆ ప్రాంతం మరో మణికొండ లాగా మారిపోవడం ఖాయం.

గండిపేట.. కోకాపేట.. మంచిరేవుల.. నర్సింగి.. పుప్పాలగూడ.. వంటి ప్రాంతాలు సహజ సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ అత్యంత ఆధునిక సాంకేతికతతో రాయల్ జీవనశైలి ప్రతిబింబించే విధంగా నిర్మాణాలు నిర్మించడం మామూలు విషయం కాదు. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు గ్లోబల్ ప్రమాణాలను అందిస్తోంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. వెస్ట్ హైదరాబాదులో.. ప్రైమ్ లొకేషన్లో.. భారీగా పెట్టుబడులకు.. లగ్జరీ అపార్ట్మెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper